ప్రస్తుత కాలంలో యువకుల చేతుల్లో అమ్మాయిలు ప్రేమ పేరుతో దారుణంగా మోసపోతున్నారు. అబ్బాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుంటారని నమ్మకంతో పెళ్లికాకముందే సర్వస్వం వారికి అంకితం చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా నంద్యాల జిల్లాలో కూడా ఇటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. నంద్యాల పట్టణంలో నివసిస్తున్న ఆర్ఎంపీ వైద్యుడు ప్రేమ పేరుతో ఒక యువతిని లొంగదీసుకుని ఆమెను గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ఆమెకు అబార్షన్ చేయబోయి చిక్కుల్లో పడ్డాడు.
వివరాలలోకి వెళితే… నంద్యాల జిల్లాకు చెందిన రాజేష్ అనే ఒక ఆర్ఎంపి వైద్యుడు గత కొంతకాలంగా ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో యువతి కూడా రాజేష్ ని బాగా నమ్మి పలుమార్లు శారీరకంగా కూడ అతనితో కలిసింది. అయితే ఇటీవల ఆ యువతి గర్భం దాల్చింది. పెళ్లి కాకుండా ఇలా గర్భం దాల్చడంతో కుటుంబ సభ్యులకు భయపడి అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రాజేష్ ఆర్ఎంపి వైద్యుడు కావడంతో అతనే అబార్షన్ చేయటానికి ప్రయత్నించాడు.
ఈ ప్రయత్నంలో యువతి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషయమించింది. దీంతో ఏం చేయాలో తెలియక రాజేష్ ఆ యువతిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే కూతురి అనారోగ్య పరిస్థితి గురించి విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఆర్.ఎం.పి వైద్యుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తమ కూతురికి మాయమాటలు చెప్పి గర్భవతిని చేసి మోసం చేసిన ఆర్ఎంపి వైద్యుడు పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.