ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నేతలు ఎక్కువగా స్వార్థపూరిత రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏ పని చేసినా తమకు కలిగే బెనిఫిట్ ఏంటని రాజకీయ నేతలు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత మోదీ పవన్ కళ్యాణ్ కలవలేదు. ఈరోజు మోదీ పర్యటన నేపథ్యంలో మోదీ పవన్ భేటీ జరగనుండటం హాట్ టాపిక్ అయింది. ఈ భేటీతో బీజేపీ జనసేన పొత్తు గురించి స్పష్టత రానుంది.
ప్రధాని కార్యాలయం నుంచి పవన్ కు ఈ మేరకు వర్తమానం అందిందని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ మోదీని కలిసి రూట్ మ్యాప్ అడగనున్నారని కూడా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. బీజేపీ జనసేన పొత్తులకు సంబంధించిన ప్రశ్నల గురించి కూడా స్పష్టత రానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మోదీ పవన్ భేటీ చంద్రబాబుకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది.
మోదీ పవన్ భేటీ జగన్ కు నష్టం చేస్తుందో లేక చంద్రబాబుకు నష్టం చేస్తుందో చూడాల్సి ఉంది. టీడీపీని కూడా కలుపుకుందామని పవన్ ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్ కు మోదీ ఎలా రియాక్ట్ అవుతరో చూడాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావాలని మోదీ ఆకాంక్ష కాగా ఆ కోరిక నెరవెరడం సులువు కాదు. అయితే బీజేపీ అధికారంలోకి రావాలని మోదీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా అడుగులు వేయడానికి పవన్ సైతం ఇష్టపడటం లేదు. బీజేపీకి ఏ పార్టీ అయినా ఒకసారి దూరమైతే భవిష్యత్తులో ఆ పార్టీకి బీజేపీ ప్రాధాన్యత ఇవ్వదు. 2024 ఎన్నికల్లో ఏపీలో గెలవడం కోసం అన్ని పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో జగన్ పై కొంతమేర వ్యతిరేకత ఉండగా ఆ వ్యతిరేకతను జగన్ ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది.