ఎక్కడికి వెళ్లినా డ్యాన్సులు చేస్తున్న రోజా.. పరిస్థితులు అర్థమవుతున్నాయా?

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా జగన్ దయ వల్ల మంత్రి పదవిని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దగా ప్రాధాన్యత లేని శాఖ దక్కినా తనకు మంత్రి పదవి దక్కడంతో రోజా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే మంత్రి పదవి వచ్చిన తర్వాత సినిమాలకు, టీవీ షోలకు గుడ్ బై చెప్పిన రోజా తనకు ఎంతో ఇష్టమైన డ్యాన్స్ ను మాత్రం వదులుకోలేకపోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తాను ఎక్కడికి వెళ్లినా డ్యాన్స్ లు చేయడం ద్వారా రోజా వార్తల్లో నిలుస్తున్నారు. లంబసంగిలో టూరిజం వారి రిసార్ట్స్ ను ప్రారంభించిన రోజా అక్కడ ఉన్నవాళ్లతో కాలు కదుపుతూ ధింసా నృత్యం చేశారు. రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్ట్ ల దిశగా అడుగులు వేస్తున్నట్టు రోజా వెల్లడించారు. అయితే రోజాకు సొంత పార్టీలోనే అనుకుల పరిస్థితులు లేవు. వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వకుండా చేయాలనే దిశగా అడుగులు పడుతున్నాయి.

రోజా డ్యాన్స్ లు చేయడం వల్ల టీడీపీకి, ఇతర పార్టీలకు విమర్శలు చేసే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. నగరి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి షాక్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా రోజా మారాల్సిన అవసరం ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రోజా మారని పక్షంలో ఆమె పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడే ఛాన్స్ అయితే ఉంది.

నగరి నియోజకవర్గ అభివృద్ధి కోసం రోజా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మరోసారి ఎమ్మెల్యేగా గెలవాలంటే మాత్రం మరింత కష్టపడక తప్పదు. తన గురించి వ్యక్తమవుతున్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని రోజా ఇకనైనా మారతారో లేదో అనే చర్చ జరుగుతోంది.