సినీ నటి హేమ, పార్టీలు మారీ.. మారీ.. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో చిన్న హాల్ట్ వేసినట్టున్నారు. కాస్సేపటి క్రితమే భారతీయ జనతా పార్టీలో చేరారామె. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారం కోసం వస్తే, ఆ సందర్భంలో హేమ కూడా ప్రసంగించేశారు వేదిక పైనుంచి. ‘హాస్య నటి’ అంటూ బీజేపీ నేతలు ఆమె గురించి ఇంట్రడక్షన్ సోషల్ మీడియాలో బాగానే ఇచ్చారు. ఇది ముందే ఊహించారేమో, హేమ బాగానే కామెడీ చేసేశారు. లేకపోతే, తిరుపతి లోక్ సభ అభ్యర్థిని మంచి ఓటు బ్యాంకుతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని హేమ కోరడమేంటి.? బాబోయ్, ప్రసంగమంతా ఇలాంటి కామెడీలే. రత్నప్రభ పూర్తి పేరు కూడా హేమకి తెలియదు. మామూలుగా అయితే హేమ మాటల పుట్ట. రాజకీయ ప్రసంగాలైనా చేసెయ్యగలరామె.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లోనూ పోటీ చేసిన అనుభవం వుంది.
కొన్నాళ్ళ క్రితం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి కూడా హేమ అసెంబ్లీకి పోటీ చేసిన విషయం విదితమే. వైసీపీలో కొన్నాళ్ళు వున్న హేమ, ఆ పార్టీని ఎందుకు వీడారో ఏమోగానీ, బీజేపీ వైపుకు ఆమె రావడంతో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక వేళ పెద్ద కామెడీ అయిపోయింది. అసలు ఆమెకు మాట్లాడే అవకాశం బీజేపీ నేతలు ఎందుకు ఇచ్చినట్లు.? ఇస్తే తప్పేమీ లేదుగానీ, వచ్చిన అవకాశాన్నే హేమ సద్వినియోగం చేసుకోలేకపోయారు.. పైగా కామెడీ చేసేసి, బీజేపీ శ్రేణుల నుంచే విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. హేమ ప్రసంగం సోషల్ మీడియాల వైరల్ అయ్యింది.. బీజేపీ పరువు గోవిందా.. అయిపోతోంది