గతకొన్ని రోజులుగా ఏపీ పాలిటిక్స్ లో పవన్ కల్యాణ్ రెండో మాజీ భార్య రేణూ దేశాయ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె విడుదల చేసిన ఒక వీడియో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలో పవన్ కు రాజకీయంగా ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ ఆమె వ్యాఖ్యానించింది.
దీంతో… ఈ వీడియో విడుదలయిన అనంతరం.. రేణూలో ఏమిటీ మార్పు అనే చర్చ విపరీతంగా జరిగింది. ఆమెకు ఆమెగానే చెప్పారా.. లేక, ఎవరైనా ఫోర్స్ గా చెప్పించారా అనే చర్చా తెరపైకి వచ్చింది. ఈ సమయంలో అంబటి రాంబాబు ఆన్ లైన్ వేదీకగా స్పందించారు. రేణు దేశాయ్ కి తనదైన ఒక సూచన చేశారు.
“అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!” అంటూ ఆన్ లైన్ వేదికగా స్పందించారు అంబటి రాంబాబు. బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర విషయంలో గతకొన్ని రోజులుగా ఫైరవుతున్న ఆయన… ఆ విషయంపై స్పందించడానికి వచ్చిన ఏ విషయాన్ని వదులుకోవడం లేదు! ఈసారి మరో కీలక వ్యాఖ్య చేశారు.
ఇటీవల రేణు ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసిన నేపథ్యలో… ఒక్క తన విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ కచ్చితంగా మోసం చేశారని, అది తన వ్యక్తిగతమని… కాకపోతే మిగిలిన విషయాల్లో మంచోడని, డబ్బు పిచ్చ లేనోడని రేణు వెనకేసుకొచ్చారు. రాజకీయాల్లో ఒక్కసారి ఆయనకు అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు.
దీంతో స్పందించిన అంబటి… పదిమంది ముందూ తాళికట్టి, ప్రమాణాలు చేసి, ఏడడుగులు నడిచిన భార్యనే మోసగిస్తే.. ఇక సమాజం ఒక్క లెక్కా అనేది అంబటి లాజిక్. ఆ కోణంలోనే పవన్ పై సెటైర్స్ విసిరారు. రేణుని మోసం చేసినోడు రాష్ట్రాన్ని మోసం చేయడా అనేది ఆయన లాజికల్ క్వశ్చన్ గా ఉంది.
ఇదే సమయంలో తనకు అన్యాయం చేసినా.. హిందూ మహిళగా విశాల దృక్పథంతో తన కుమారుడి తండ్రి సీఎం కావాలని రేణు దేశాయ్ కోరుకోవడంలో తప్పులేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన ఆయన… పవన్ కు అవకాశమిచ్చేందుకు ప్రజలు మాత్రం సిద్ధంగా లేరని తెలిపారు. సత్తెనపల్లిలోని పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.