జూ.ఎన్టీఆర్ ఫోటోలు పీకిపారేయండి.. ఇంకెప్పుడూ కనిపించకూడదు!

పైకి నందమూరి ఫ్యామిలీపై చంద్రబాబు ఎన్ని ప్రేమ కబుర్లు చెప్పినా… జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు లోకేష్ మాట్లాడినా… తండ్రీకొడుకులకు లోలోపల మాత్రం నందమూరి ఫ్యామిలీ అంటే ఏమాత్రం ప్రేమ, గౌరవం, అభిమానం లేవని.. పైగా ఆ పేరు పలికినా, వారి ఫోటోలు కనిపించినా బీపీ పెరిగిపోద్దని చెప్పే సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

అవును… నందమూరి వారసుడు, టీడీపీ చైతన్య రధసారధి స్వర్గీయ నందమూరి హరికృష్ణ బిడ్డ… జూనియర్ ఎన్టీఅర్ ఫోటో కనిపిస్తే, అది కూడా తన సభల్లో ఆ పేరు వినిపిస్తే చంద్రబాబుకు మంటెక్కిపోద్ది. ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీకి నందమూరి వారసుడిగా, తాతకు తగ్గ మనవడిగా జూనియర్ ఎన్టీఅర్ నుంచే లోకేష్ కు సమస్య ఉందని బలంగా నమ్ముతున్న బాబు… పార్టీ క్యాడర్ నుంచి ఆయన్ని దూరం చేయాలని తెగ తాపత్రయపడిపోతున్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కృష్ణాజిల్లా పర్యటనలో ఉండగా… విజయవాడ నుంచి మచిలీపట్నం వరకూ కొంతమంది టీడీపీ కార్యకర్తలు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, హ‌రికృష్ణ ల ఫొటోల‌ను ప్రదర్శించారు. అంతేకాకుండా చంద్రబాబు కాన్వాయ్ ఎదుట “జూనియ‌ర్ ఎన్టీఆర్ టీడీపీ సీఎం క్యాండిడేట్” అంటూ అభిమానులు గ‌ట్టిగా నినాదాలు చేశారు. దీంతో షాక్ తిన్న చంద్రబాబుకు దడొచ్చేసింది. అసలే ఆ ఫోటోలు చూస్తున్న కోపానికి తోడు.. నినాదాలు కూడా తోడవ్వడంతో.. ఆ ఫొటోల‌ను వెంట‌నే తీసిపారేయాలని క్యాడ‌ర్‌ ను గట్టిగా ఆదేశించారు.

అంతేకాకుండా.. మ‌రోసారి టీడీపీ సభల్లో కానీ, ర్యాలీల్లో కానీ ఆ ఫొటోలు క‌న‌బ‌డ‌కూడ‌ద‌ని సీరియస్ గా స్ట్రిక్ట్‌ గా ఆదేశాలు జారీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పేరున నినాదాలు చేసిన‌వారిని ఈడ్చిప‌డేయాలంటూ గట్టిగా అరిచారు! దీంతో.. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫొటో పెట్టుకున్న యువ‌కులపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. మ‌చిలీప‌ట్నంలోని మూడు బొమ్మల సెంట‌ర్‌ లో జూనియ‌ర్ ఎన్టీఆర్ పాట‌ల‌కు డ్యాన్స్ చేస్తున్నవారిని సైతం విడిచిపెట్టని టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే కొల్లు ర‌వీంద్ర‌, ఆయ‌న అనుచ‌రులు.. దాడిచేసి చెద‌ర‌గొట్టారు.

దీంతో… “ఇది నందమూరి ఫ్యామిలీపై చంద్రబాబుకున్న అసలు ప్రేమ” అని, ఇలాంటి సంఘటనలు చూసినప్పుడైనా జూనియర్ మేల్కోవాలని, వీలైనంత తొందర్లో రాజకీయాల్లోకి రావాలని, అప్పటివరకూ టీడీపీ ఉన్నా లేకున్నా చేతుల్లోకి తీసుకోవాలని ఆన్ లైన్ వేదికగా రిక్వస్ట్లు పెడుతున్నారు నందమూరి అభిమానులు!

Jr NTR Photos In Chandrababu Machilipatnam Rally | Ntv