చంద్రబాబు ని చెడుగుడు ఆడుకున్న వైసీపీ ఎమ్మెల్యే – జగన్ వరకూ అక్కర్లేదు నేను చాలు అంటూ !

nimmalagadda ramesh kumar supports chandrababu naidu

స్టీల్ పై ప్రధానికి లేఖ రాస్తే.. జైల్లో వేస్తారని చంద్రబాబుకు భయమా..? అంటూ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఫేక్ వెబ్ సైట్లు, ఫేక్ ఫలితాలతో చంద్రబాబే పెద్ద ఫేక్ అని తేలింది అని ఆయన ఎద్దేవా చేసారు. ఓటమిని ఒప్పుకునే ధైర్యం లేని చంద్రబాబు చీకట్లో లెక్కపెట్టారంటూ సిగ్గులేని వాదనలు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.

tdp activists oppose chandrababu naidu on nimmagadda issue

కరోనా తర్వాత బలహీనంగా ఉన్న పల్లా శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలిస్తే తప్పేంటి చంద్రబాబూ అని నిలదీశారు. పల్లా బదులు చంద్రబాబు కొడుకో లేక ఎంవీవీఎస్ మూర్తి మనవడ్నో నిరాహార దీక్షకు కూర్చోబెట్టవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దన్న తండ్రీకొడుకులు ఏ మొహం పెట్టుకుని అడుగు పెడతారు, అని నిలదీశారు. అమరావతిలోనే అన్నీ ఉండాలంటున్న వారిని చంద్రబాబు విశాఖ ఎలా తీసుకెళ్ళారు అని ఆయన నిలదీశారు.

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై 2014-19 మధ్య చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నాడు అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మనిషిలా మాట్లాడటం లేదు.. కేవలం రాజకీయం కోసమే మాట్లాడుతున్నాడు అని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 54 ప్రభుత్వరంగ సంస్థల్ని ఇష్టారాజ్యంగా ప్రైవేటీకరించిందీ, తెగనమ్మింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన శ్రీ జగన్.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆమోదిస్తారా అని నిలదీశారు.

రాష్ట్రంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీకి అన్ని ప్రాంతాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని అన్నారు. దీంతో తన పార్టీ ఉనికి కోల్పోతామన్న భయంతో చంద్రబాబు, తనకు 15 శాతం లోపు సీట్లు మాత్రమే వచ్చాయని తెలిసి, ఇక ఫేక్ వెబ్ సైట్లు పెట్టుకుని ప్రచారం చేసుకునే పరిస్థితికి దిగజారాడు. దీంతో ఫేక్ ఎవరో, ఫేక్ పార్టీ ఎవరిదో తేలిపోయింది అని ఆయన ఎద్దేవా చేసారు. 2019 జనరల్ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 86 శాతం సీట్లు వైయస్ఆర్సీపీకి వచ్చాయి అని ఆయన అన్నారు.