నిరుద్యోగులకు గుడ్ న్యూస్… 76 వేల ఉద్యోగాలు భర్తీకి కేంద్ర ప్రభుత్వం రెడీ

కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎన్నికలకు ముందు నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్రం సిద్దమైంది. కేంద్ర పారామిలటరీ బలగాల్లో భారీగా పోస్టులను రిక్రూట్ చేసుకునేందుకు హోం శాఖ సిద్దమైంది. 76 వేల 578 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్ట తెలిపింది. సీఆర్ పిఎఫ్, బీఎస్ ఎఫ్, ఎస్ ఎస్ బీ విభాగాల్లో ఖాళీలు త్వరలో భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగాల్లో 54 వేల 953 కానిస్టేబుల్ పోస్టులుండగా వీటిలో మహిళల కోసం 7646 పోస్టులను కేటాయించారు.

కానిస్టేబుల్ పోస్టులలో అత్యధికంగా సీఆర్పీఎఫ్ లో 21,566 ఖాళీలున్నాయి.

బీఎస్ ఎఫ్ లో 16,984 పోస్టులు

ఎస్ ఎస్ బీలో 8546 పోస్టులు

ఐటిబీపీలో 4123 పోస్టులు

అస్సాం రైఫిల్స్ లో 3076 పోస్టులున్నాయి. ఈ పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.  వీటికి ఫిబ్రవరి 11 వ తేది నుంచి మార్చి 14 వ తేది వరకు ఆన్ లైన్ టెస్ట్ కండక్ట్ చేయనున్నారు. ఎస్సై హోదాలో 1073 పోస్టులుండగా వాటిలో బీఎస్ ఎఫ్  లో 508, సీఆర్పీఎఫ్ లో 274, ఎస్ ఎస్ బీలో 206, ఐటిబిపిలో 85 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులక అదనంగా ట్రేడ్స్ మెన్, హోం శాఖ, వైద్యం, పారా మెడికల్, కమ్యూనికేషన్స్ ,ఇంజనీరింగ్ విభాగాల్లో మరో 20,086 పోస్టులను ప్రమోషన్ల ద్వారా హోం శాఖ భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రకటన ఎన్నికలకు ముందుగానే రానుందని తెలుస్తోంది.