ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్… ఉచితంగా ఎస్సై కానిస్టేబుల్ శిక్షణ.. ఎలా అప్లై చేయాలంటే?

ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతీ కోసం ఏపీ ప్రభుత్వం కానిస్టేబుల్ ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది నిరుద్యోగులు ఈ పరీక్షలకు హాజరు కావడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే వారికి మరొక గుడ్ న్యూస్ అని చెప్పాలి.ఎస్సై కానిస్టేబుల్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి ఉచిత శిక్షణ ఎక్కడ ఇవ్వబడుతుంది ఈ శిక్షణకు ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయానికి వస్తే…

ఎస్సై కానిస్టేబుల్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జేడీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మంగళవారం వెల్లడించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్‌ సంస్థ అయిన ఐఎసిఇ భాగస్వామ్యంతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానల్లో ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. అయితే ఉచిత శిక్షణకు హాజరు కావాలంటే ముందుగా నిర్వహించిన అనంతరం అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే ఉచిత శిక్షణ ఇవ్వబడునున్నట్లు తెలియజేశారు.

ఈ ఉచిత శిక్షణ కోసం స్ట్రీనింగ్‌ టెస్ట్‌ డిసెంబరు 11వ తేదీని ఉదయం 9 గంటల 30 38 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. వీటిల్లో దాదాపు 21 పరీక్ష కేంద్రాలు ఏపీలోనే ఉంటాయి. ఇక ఈ స్క్రీనింగ్ టెస్ట్ హాజరు కావాలనుకున్నవారు రిజిస్ట్రేషన్ కోసం 7093651037 వాట్సప్‌ నంబర్‌కు ‘Hai’ అని ఇంగ్లిష్‌లో టైప్‌ చేసి మెసేజ్‌ చేయాలి. ఈ విషయంలో ఎవరికైనా ఎలాంటి సందేహాలు తలెత్తిన ఈ క్రింది ఫోన్ నెంబర్ 9533200400కు సంప్రదించవల్సిందిగా జేడీ లక్ష్మీనారాయణ సూచించారు.నిరుద్యోగంతో బాధపడుతూ ఎలాగైనా జాబ్ కొట్టాలని భావించే అభ్యర్థులకు ఇది ఒక సువర్ణమైన అవకాశం అని చెప్పాలి.