జగన్ టీంలోకి తొందరలో ఫైర్ బ్రాండ్ ఆఫీసర్ ?

జగన్మోహన్ రెడ్డి టీంలోకి తొందరలో  ఓ ఫైర్ బ్రాండ్ అధికారి రానున్నట్లు సమాచారం. కర్నాటక క్యాడర్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న తెలుగు యువ అధికారి రోహిణీ సింధూరిని డిప్యుటేషన్ పై ఏపికి తెచ్చుకునే విషయంలో జగన్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణాకు చెందిన 2009 ఐఏఎస్ అధికారి రోహిణి కర్నాటకలో సంచలనాలు సృష్టిస్తున్నారు. అక్రమార్కులు, అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఐఏఎస్ అధికారిగా 10 ఏళ్ళ సర్వీసులో అంతకు మించే బదిలీలు జరిగాయట.

సింధూరి ఏ జిల్లాలో, ఏ శాఖలో పనిచేసినా మిగిలిన వాళ్ళకు సమస్యగా మారుతోందట. అంటే ఓ విధంగా చూస్తే సినిమాలో ఫైర్ బ్రాండ్ టైప్ అనే అనుకోవాలి. దాంతో సింధూరి బదిలీ అవుతోందంటే ఏ మంత్రి కూడా తమ జిల్లాలో పోస్టింగ్ వద్దంటూ అడ్డుకుంటున్నారట.

అలాంటి సింధూరిని జగన్ ఏరికోరి ఏపికి తెప్పించుకుంటున్నారు. సింధూరిని డిప్యుటేషన్ పై పంపాలంటూ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. ఈ విషయం తెలిసి కర్నాటక ప్రభుత్వం ఎగిరి గంతేసిందట. కర్నాటక సంగతి సరే మరి కేంద్రం ఏమంటుందో చూడాలి.