మంచు మనోజ్, విష్ణుల మధ్య గొడవకి కారణమేంటబ్బా.?

మంచు మోహన్‌బాబు అంటే క్రమశిక్షణకి కేరాఫ్ అడ్రస్.. అని ప్రచారం చేసుకుంటుంటారు. ‘మా నాన్న పెంపకంలో మేమూ అదే క్రమశిక్షణ నేర్చుకున్నాం..’ అని లక్ష్మి, విష్ణు, మనోజ్ చెప్పడం చూశాం. కుటుంబం అన్నాక, చిన్నా చితకా సమస్యలు వుండొచ్చుగాక. కానీ, అవి రోడ్డున పడేంతలా మారితే.?

ఏమయ్యిందో తెలియదు, ‘మావాళ్ళ మీదా.. మా బంధువుల మీదా ఇదిగో ఇలా దాడులు చేస్తుంటారు..’ అంటూ సంచలన ఆరోపణలు చేస్తూ మంచు మనోజ్ తన అన్నకి వ్యతిరేకంగా ఓ వీడియో విడుదల చేశాడు. అందులో మంచు విష్ణు, ఎవరితోనో గొడవ పడుతున్నాడు. దాన్ని ఇంకెవరో చిత్రీకరించారు.

అయితే, వీడియో చిత్రీకరించింది మంచు మనోజ్ అట. విష్ణు గొడవ పడుతున్నది కూడా మనోజ్‌తోనేనట. మధ్యలో సారధి అనే వ్యక్తి ఆ గొడవని ఆపలేకపోయాడట. గొడవ జరిగింది సారధి ఇంట్లోనేనట. ఈ క్రమంలో సారధికి గాయాలయ్యాయట కూడా.! ‘అబ్బే, ఇదంతా ప్రాంక్ వీడియో’ అని కొందరు లైట్ తీసుకున్నారు. కానీ, ఒకరొకరుగా మంచు కుటుంబం నుంచి స్పందిస్తూ వచ్చినట్లు మీడియాలో వార్తలొచ్చాయ్. దాంతో, గొడవ నిజమేనని తేలిపోయింది. ‘చిన్నోడు మంచు మనోజ్.. అందుకే తెలిసీ తెలియక ఆ వీడియో పోస్ట్ చేశాడు.. పెద్ద గొడవేమీ కాదు..’ అని అంటున్నాడట విష్ణు.

‘పిల్లలిద్దరికీ నచ్చజెబుతున్నాను.. కానీ, వాళ్ళే పరిస్థితిని అర్థం చేసుకోవడంలేదు’ అంటున్నారట మోహన్‌బాబు. ఈ వయసులో మోహన్‌బాబుకి పిల్లల గొడవ పెద్ద కష్టమే.! మనోజ్ ఇటీవల చేసుకున్న పెళ్ళి కారణంగానేనా ఈ గొడవలు.? అన్నది తెలియాల్సి వుంది.