Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పార్వతీ పురం మన్యం జిల్లాల పర్యటనలో ఉన్న విషయం మనకు తెలిసిందే ఇలా గత కొద్ది రోజులుగా ఈయన గిరిజన ప్రాంతాలలో పర్యటిస్తూ అక్కడ వారి సమస్యలను తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి అడుగులు వేస్తున్నారు. ఇలా గతి కొద్ది రోజులుగా గిరిజన ప్రాంతాలలో పర్యటిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పర్యటనలో నకలి ఐపీఎస్ రావటం సంచలనం రేపుతుంది
మన్నెం జిల్లాలో పర్యటన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కు వై కేటగిరి భద్రత కల్పించారు అయితే ఈ భద్రతలో భాగంగా నకిలీ ఐపీఎస్ డ్రస్సులో బలివాడ సూర్యప్రకాశరావు అనే వ్యక్తి హల్చల్ చేశారు. ఈయన ఐపీఎస్ డ్రెస్ లో రావడంతో నిజమైన అధికారి అని అందరూ భావించారు ఈయనతో కొంతమంది అధికారులు ఫోటోలు కూడా దిగారు అయితే ఈయన నకిలీ వ్యక్తి అని తెలుసుకోవడంతో వెంటనే అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
ఈ విధంగా డిప్యూటీ సీఎం పర్యటనలో నకిలీ ఐపీఎస్ రావడం విషయం కలకలం రేపుతుంది. ఇక ఈ విషయంపై హోం శాఖ మంత్రి అనిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రత లోపంపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు అలాగే ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఈమె అధికారులను ఆదేశించారు.
ఇక ఈ విషయం ప్రస్తుతం జనసైనికులలోను అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులలోను ఎంతో ఆందోళన కలిగిస్తుంది. డిప్యూటీ సీఎం హోదాలో ఎంతోమంది ఐఏఎస్ లు, ఐపీఎస్ ల భద్రత నడుమ ఇలా ఒక నకిలీ వ్యక్తి ఐపీఎస్ డ్రస్సులో పవన్ కళ్యాణ్ వద్దకు రావడంతో అలా రావటం వెనుక గల కారణం ఏంటి అంటూ సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ మరింత భద్రత పెంచాలి అంటూ డిమాండ్లు చేస్తున్నారు.