మస్ట్ రీడ్: చంద్రబాబు ప్రతీ అభిమానీ చదవాల్సిన వార్త ఇది!

అభిమానులు అనేవారు అందరికీ ఉంటారు. ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కి ఉంటే.. వైఎస్సార్ అభిమానులు వైఎస్సార్ కి ఉంటే.. జగన్ అభిమానులు జగన్ కుంటే… చంద్రబాబు అభిమానులు చంద్రబాబుకి ఉంటారు. పైగా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్.. అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించిన ముఖ్యమంత్రి. ఆయనకు అభిమానులు ఉండరా? సినిమాల సంగతి పక్కన పెట్టి ఓన్లీ పాలిటిక్స్ పరంగా చూసుకుంటే పైన చెప్పుకున్న ముగ్గురికంటే చంద్రబాబు సీనియర్! కచ్చితంగా ఆయనకు బలమైన ఫ్యాన్ బెల్ట్ ఉంది.

ఆ ఫ్యాన్ బెల్ట్ ఇప్పుడు ఫీలవుతుంది. టీడీపీ అంటే ఎన్టీఆర్ – ఎన్టీఆర్ అంటే టీడీపీ… ఇంకెంత కాలం? అనేది వారి మనోవేదనకు ప్రధాన కారణం. ఎప్పటికీ ఎన్టీఆర్ జయంతే మహానాడుకు ముహూర్తమా.. రాబోయే రోజుల్లో అయినా చంద్రబాబు బర్త్ డే అనేది మహానాడుకు ముహూర్తం కాకూడదా? వారి మనోవేదన!! ఎప్పటికీ ఎన్టీఆర్ పాలన, రామ రాజ్యం కబుర్లేనా… చంద్రన్న రాజ్యం.. చంద్ర పాలన.. చంద్రుడి వెన్నల లాంటి పరిపాలన వంటి మాటలు ఎందుకు చెప్పడం లేదు. ఇది వారి ఆవేదనలో పీక్స్!

వాస్తవంగా చెప్పాలంటే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు.. స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు. కాదనలేని సత్యం!! మరి ఇంతకాలం పార్టీని బ్రతికించి, అధికారంలోకి తీసుకొచ్చి.. ప్రతిపక్షంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కాపాడిన వ్యక్తి ఏమవ్వాలి? టీడీపీ కార్యకర్తలంతా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది! చంద్రబాబు వయసుకు, ఓపికకు, సత్తాకు, జనరంజక పాలనకూ ఆయనకు గుర్తింపు వద్దా? టీడీపీ కార్యకర్తలెవరూ సమాధానం చెప్పలేని ప్రశ్నలివి!

అందుకే ఇకపై ఏపీలో ప్రతీ టీడీపీ కార్యకర్తా చెప్పాల్సిన మాట ఒక్కటే… రాబోయే రోజుల్లో మరోసారి చంద్రన్న రాజ్యం రావాలని. ఎన్టీఆర్ తర్వాత రెండు సార్లు చంద్రబాబు సీఎం అయ్యారు. ఇంకా ఎన్టీఆర్ రాజ్యం ఎందుకు? బాబు కంటూ ఒక విజన్ ఉంది.. ప్రతీ పేదవాడినీ ధనవంతుడిని చేయాలనే లక్ష్యం ఉంది. కాబట్టి… ఇకపై టీడీపీ కార్యకర్తలంతా… చంద్రన్న రాజ్యం తెస్తామని ఓట్లు అడగాలి. చంద్రన్న పాలన కావాలంటే ఓట్లు వేయండని కోరాలి.

వైఎస్సార్ చనిపోయిన అనంతరం మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జగన్ మాత్రం… తనపాలనపై నమ్మకం ఉంటే, మీ బిడ్డపై విశ్వాసం ఉంటే, మరోసారి తన పాలన కావాలనుకుంటే, తన ప్రభుత్వంలో లభ్ది పొందితే ఓట్లు వేయండని చెబుతున్నారు. ఒక్కసారి గెలిచి సీఎం అయిన ఆయనకే అంత ఉంటే… మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఇంకెంతుండాలి. అందుకే ఇకపై టీడీపీ స్లోగన్స్ మారాలి. టీడీపీ అధికారంలోకి వస్తే పరిపాలించేది స్వర్గస్తులైన ఎన్టీఆర్ కాదు… సజీవంగా ఉన్న చంద్రబాబు. సో… చంద్రన్న పాలన కావాలని ఓట్లు అడుగుదాం.. చంద్రన్న రాజ్యం కోసం కష్టపడదాం… అంటూ రిక్వస్టులు పెడుతున్నారు బాబు అభిమానులు.

మరి వారి ఆవేదనను నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అర్ధం చేసుకుంటారా? లేక, చంద్రబాబుని ఉత్సవ విగ్రహాన్ని చేసి.. ఇంకా ఎన్టీఆర్ పేరుని, ఫోటోని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసుకుంటూ లోకేష్ కు ఫ్యూచర్ లేకుండా చేస్తారా అన్నది వేచి చూడాలి!