Duvvada Srinivas: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నాయకుల పై వరుసగా కేసులు నమోదు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పట్ల కూడా కేసు నమోదు అవ్వడమే కాకుండా విచారణకు హాజరు కావాలి అంటూ పోలీసులు తనకు నోటీసులు పంపించడంతో ఈయన ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా పోలీసులు తనకు నోటీసులు పంపిన విషయం గురించి ఈయన మీడియా సమావేశంలో మాట్లాడితే చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిపై అక్రమంగా కేసులు పెడుతూ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక శాసనమండలిలో నేను మద్యం గురించి ప్రశ్నించినందుకే నాపై కేసులో పెట్టారు అలాగే తాను పవన్ కళ్యాణ్ కు రెండు సంవత్సరాల క్రితం చెప్పు చూయించినందుకు ఇప్పుడు కేసులు పెట్టారు అంటూ కూడా ఈయన మండిపడ్డారు.
ఇలా పవన్ కళ్యాణ్ కు నేను చెప్పు చూపించినందుకు కేసు పెడితే నాకంటే ముందుగా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు చూయిస్తూ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలి అంటూ ఈయన డిమాండ్ చేశారు. జనసేన అధినేతగా గతంలో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి చెప్పు చూయిస్తూ వార్నింగ్ ఇచ్చారు ఆ వ్యాఖ్యలకు కౌంటర్ గా తాను కూడా పవన్ కళ్యాణ్ కు అదే చెప్పు చూయించి వార్నింగ్ ఇచ్చాను.
ఇప్పుడు ఆ విషయం గురించి నాపై కేసు పెడితే నాకంటే ముందు గానే పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టాలని ఈయన డిమాండ్ చేశారు. ఇక తమ ఇంటి వద్దకు వచ్చి చంపేస్తామని జనసేన నాయకులు బెదిరించారని, వారిపైనా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తనపై ఎవరు ఎన్ని కేసులు పెట్టినా ఏమాత్రం అదిరేది బెదిరేదే లేదు అంటూ ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక కొంతమంది ఈయన చెప్పిన మాటలలో కూడా నిజం ఉంది అంటూ ఈయనకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.