క్రాస్ ఓటింగ్ కొంప ముంచటం ఖాయమేనా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోలింగ్ జరిగిన తర్వాత పార్టీలు, అభ్యర్ధులు గెలుపోటములపై సమీక్షలు చేసుకోవటం మామూలే. కానీ టిడిపి తరపున విశాఖపట్నం నియోజకవర్గానికి పోటీ చేసిన భరత్ విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోందట. గెలుపోటములను పక్కనపెట్టిన భరత్ టిడిపి నుండి క్రాస్ ఓటింగ్ జరిపించిందెవరు అనే విషయంలో ఆధారాలను వెతుకుంటున్నట్లు సమాచారం.

నిజానికి భరత్ కు టికెట్ ఇవ్వటం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నందమూరి బాలకృష్ణకు చిన్నల్లుడు కావటంతో వేరే దారిలేక టికెట్ ఇవ్వాల్సొచ్చింది. టికెట్ అయితే ఆపలేకపోయారు కానీ గెలుపు, ఓటములు చంద్రబాబు చేతిలో పనేకదా. అందులోను గెలిపించలేకపోవచ్చు కానీ ఓడగొట్టటం తేలికే. ఇక్కడ జిరిగిందదే అనే ప్రచారం టిడిపిలోనే బాగా జరుగుతోంది.

ఒక చేత్తో భరత్ కు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి మరో చేత్తో భరత్ కు ఓట్లు వేయించొద్దంటూ పార్టీ ముఖ్యల నుండి ఆదేశాలు అందినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. భరత్ కు కాకుండా జనసేన అభ్యర్ధి జేడి లక్ష్మీనారాయణకు ఓట్లు వేయండని వచ్చిన ఆదేశాల మేరకు చాలా ఓట్లు టిడిపి నుండి జనసేనకు క్రాస్ ఓటింగ్ జరిగిందని బయటపడింది.

జరుగిన విషయాలు భరత్ దృష్టికి కూడా రావటంతో క్రాస్ ఓట్లను నిర్ధారణ చేసుకున్నారట. దాంతో నందమూరి, నారా కుటుంబాలపై భరత్ మండిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేపటి కౌంటింగ్ లో ఫలితలను బట్టి భరత్ నోరిప్పాలని నిర్ణయించుకున్నారట. టిడిపి ఓడిపోయి, భరత్ కూడా ఓడిపోతే పరిస్ధితి ఒకలాగుంటుందట. అదే భరత్ ఓడిపోయి టిడిపి గెలిస్తే భరత్ బ్లాస్ట్ అవటం ఖాయమనే టిడిపి వర్గాలంటున్నాయి. చూద్దాం మే 23వ తేదీ ఏమవుతుందో ?