మీరు కానీ మీ వాళ్ళు కానీ విజయవాడలో ఉంటారా! అయితే ఈ న్యూస్ మీకే

china released corona vaccine last month

కరోనా దేశంలో ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ప్రపంచం మొత్తం కరోనా వల్ల స్తంభించిపోయింది. కొన్ని లక్షల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ కరోనా ఎలా వ్యాపిస్తుందని చెప్పడానికి కూడా ఖచ్చితమైన మార్గాలు వైద్యులకు కూడా అంతు పట్టడం లేదు. దేశంలో ఎంతమంది కరోనా భారిన పడ్డారని చెప్పడానికి కూడా మన దగ్గర ఉన్న వైద్య సదుపాయాలు సహకరించడం లేదు. అయితే ఇప్పుడు విజయవాడకు సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయవాడలో ఉన్న 40% మంది ప్రజలకు కరోనా వచ్చి తగ్గిపోయిందని సిరో సర్వేలేన్స్ విశ్లేషణలో వైద్య శాఖ అధికారులు గుర్తించారు. కృష్ణా జిల్లా మొత్తంలో ఇలా కో-రో-నా తెలియకుండా తమ శరీరంలోకి వచ్చి వెళ్ళిపోయినా వారి సంఖ్య 20 శాతం వరకు ఉందని, అధికారులు గుర్తించారు.

ఇక ఢిల్లీలో ఈ సంఖ్య 23 శాతం, మహారాష్ట్రలోని ఒక మురికి వాడలో 43 శాతం మంది ప్రజలకు, ఇలా వై-ర-స్ వచ్చి వెళ్ళిపోయిందని అధికారులు తమ విశ్లేషణలో తెలుసుకున్నారు. అయితే విజయవాడ నగరంలో 40.51 శాతం మందికి, క-రో-నా వై-ర-స్ వారి శరీరంలోకి వచ్చి, వెళ్ళిపోయిందని, ఈ సంస్థ చేసిన సర్వే వివరాలు తెలిసి అందరూ షాక్ తిన్నారు.

కృష్ణా, తూర్పు గోదావరి, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో, సిరో సర్వేలేన్స్ ప్రక్రియను వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించింది. ఐ-సి-ఏం-ఆర్ మార్గదర్శకాలు అనుసరించి, ఈ పరీక్షలు చేసారు. లక్షణాలు లేకుండా కరోనా రావడంతో అధికారులు ఆందోలన చెందుతున్నారు. ఇమ్మ్యూనిటి శక్తి ఉన్నవారు కరోనా నుండి తప్పించుకుంటున్నారు కానీ ఇమ్మ్యూనిటి శక్తి తక్కువగా ఉన్నవారు భారిన పడే అవకాశం ఉంది. విజయవాడలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లవద్దని, వెళ్లినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.