సోనియా గాంధీ నివాసంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటి సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 95 స్థానాల్లో పోటి చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 62 స్థానాల్లో అభ్యర్దుల ఎంపిక పై చర్చించారు. 57 స్థానాల్లో అభ్యర్దులను ఖరారు చేశారు. శుక్రవారం 57 స్థానాల్లో అభ్యర్దుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ 8 న కాంగ్రెస్ తుది జాబితాను ప్రకటించనుందని కుంతియా తెలిపారు.
119 స్థానాల్లో కాంగ్రెస్ 95 స్థానాల్లో పోటి చేస్తుండటంతో ఇక మిగిలేవి 24 స్థానాలు. ఇందులో టిడిపికి 12, తెలంగాణ జన సమితికి 8, సిపిఐ కి 4 స్థానాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో కూటమిలో లుకలుకలు మొదలు కావడం ఖాయమనే చర్చ జరుగుతోంది. టిడిపి 15 సీట్లు అడగగా తెలంగాణ జన సమితి కూడా 15 సీట్లు కావాలని కోరింది. సీీపిఐ కూడా 6 స్థానాలు కావాలని పట్టుబట్టింది. ఈ వివాదం నేపథ్యంలోనే బుధవారం నాడు చాడ వెంకట్ రెడ్డి ఇంట్లో టిడిపి, సిపిఐ, జన సమితి నేతలు చర్చించారు. ఇప్పుడు కాంగ్రెస్ 95 స్థానాల్లో పోటి చేస్తామని ప్రకటించడంతో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తదనే ఆరోపణలు వస్తున్నాయి.
ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టిడిపికి 14 స్థానాలు ఇవ్వాలని నిర్ణయించామని దీనికి సోనియా గాంధీ గారు ఒప్పుకున్నారని చెప్పారు. సిపిఐ, జనసమితితోనే చర్చలు జరపాల్సి ఉందన్నారు. తెలంగాణ జన సమితికి 6 సీట్లు ఇచ్చేందుకు హైకమాండ్ ఒప్పుకుందని ఉత్తమ్ తెలిపారు. సిపిఐకి 4 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందన్నారు.
కాంగ్రెస్ అడిగినన్నీ సీట్లు ఇవ్వకపోవడంతో కూటమి నేతలు ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రకటన చేసిన వెంటనే సిపిఐ నేతలు అహ్మద్ పటేల్ తో సమావేశమయ్యారు. 5 సీట్లు కావాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. సాయంత్రం వరకు చర్చించి చెబుతామని అహ్మద్ పటేల్ సిపిఐ నేతలతో తెలిపారు.
టిజెఎస్ 12 సీట్లు అడుగుతుండగా కాంగ్రెస్ మాత్రం 8 సీట్లకే మొగ్గు చూపింది. టిడిపి 18 సీట్లు అడుగుతుండగా 14 సీట్లు ఇచ్చేందుకు అంగీకరించింది.
తెలంగాణ కాంగ్రెస్ జాబితాలో దాదాపు సీట్లు ఖరారైన వారి వివరాలు
1 నల్లగొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
2 నాగార్జున సాగర్- కుందూరు జానారెడ్డి
3 నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి
4 మంథని – శ్రీధర్ బాబు
5 సిరిసిల్ల – కేకే మహేందర్ రెడ్డి
6 కొడంగల్- రేవంత్ రెడ్డి
7 వనపర్తి-చిన్నారెడ్డి
8 కల్వకుర్తి-వంశీచందర్ రెడ్డి
9 నాగర్ కర్నూల్-నాగం జనార్ధన్ రెడ్డి
10 గోషామహాల్- ముఖేష్ గౌడ్
11 సనత్ నగర్- మర్రి శశిధర్ రెడ్డి
12 నాంపల్లి-ఫిరోజ్ ఖాన్
13 వికారాబాద్ – ప్రసాద్ కుమార్
14 హూజుర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
15 ఆలంపూర్- సంపత్ కుమార్
16 షాద్ నగర్ – ప్రతాప్ రెడ్డి
17 మధిర- భట్టి విక్రమార్క
18 ములుగు- సీతక్క
19 మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి
20 నకిరేకల్- చిరుమర్తి లింగయ్య
21 కామారెడ్డి- షబ్బీర్ అలీ
22 అసిఫాబాద్- ఆత్రం సక్కు
23 తుంగతుర్తి- అద్దంకి దయాకర్
24 ఖానాపూర్-రమేష్ రాథోడ్
25 పెద్దపల్లి- విజయరమణారావు
26 జనగాం- పొన్నాల లక్ష్మయ్య
27 కరీంనగర్- పొన్నం ప్రభాకర్
28 పరిగి- రామ్మోహన్ రెడ్డి
29 జహీరాబాద్- గీతారెడ్డి
30 వికారాబాద్- ప్రసాద్ కుమార్
31 ఆలేరు- బూడిద భిక్షమయ్య గౌడ్
32 బోధన్ – సుదర్శన్ రెడ్డి
33 భూపాలపల్లి- గండ్ర వెంకటరమణా రెడ్డి
34 గజ్వేల్ – ఒంటేరు ప్రతాప్ రెడ్డి
35 బాల్కొండ- అనిల్
36 నిర్మల్- మహేశ్వర్ రెడ్డి
37 ఆంధోల్- దామోదర రాజనర్సింహ్మ
38 గద్వాల్- డికె అరుణ
39 భోథ్- సోయం బాపూరావు
40 జగిత్యాల- జీవన్ రెడ్డి
41 సంగారెడ్డి- జగ్గారెడ్డి