రేవంత్ రెడ్డి లాగే చిక్కుల్లో టిఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే

ఆదాయ పన్ను శాఖ సోదాలతో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయన నివాసం మీద రెండు రోజులపాటు ఐటి అధికారులు దాడులు చేసి సోదించారు. విలువైన డాక్యుమెంట్లు కలెక్ట్ చేశామని చెప్పారు. 3వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ రేవంత్ కు నోటీసులు అందజేసి వెళ్లిపోయారు.

ఈ సమయంలో రేవంత్ అక్రమ ఆస్తుల చిట్టా ఇదేనంటూ మీడియా సంస్థలకు ఒక అజ్ఞాత లేఖ అందింది. దీంతో మీడియా మొత్తం రేవంత్ కు ఇంత ఆస్తులంటే, అంత ఆస్తులంటూ ప్రచారాన్ని షురూ చేశాయి. కొన్ని మీడియా సంస్థలు వందల కోట్ల ఆస్తులను వెల్లడించగా మరికొన్ని మీడియా సంస్థలు రేవంత్ ఆస్తులను వెయ్యి కోట్లు దాటించాయి. ఇక రేవంత్ ను మళ్లీ అరెస్టు చేయవచ్చని ప్రచారం సాగింది. రేవంత్ కూడా చెప్పుకున్నారు. కానీ రెండు రోజులపాటు సోదాలు జరిపిన అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు.

రేవంత్ విషయంలో టిఆర్ఎస్, బిజెపి కుమ్మక్కై ఐటి దాడులు చేశాయని బలమైన ప్రచారం మరోవైపు సాగింది. కాంగ్రెస్ శ్రేణులు ఈ విషయమై ఆరోపణలు గుప్పించాయి. కాంగ్రెస్ ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం చేసినా టిఆర్ఎస్ ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో 24 గంటలు గడవకముందే సీన్ లోకి మరో టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అక్రమాస్తులు అంటూ ప్రచారం ఊపందుకున్నది.

పుట్టా మధుపై పిటిషన్ వేసిన మంథని మాజీ ఉప సర్పంచ్ సత్యానారాయణ

ఆయనెవరో కాదు.. తెలంగాణలో నిత్యం వివాదాల్లో నిలిచే మంథని తాజా ఎమ్మెల్యే పుట్టా మధు. ఆయన కూడా పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు అందాయి. శనివారం ఉదయం నుంచి పుట్టా మధు మరోసారి వివాదంలోకి వచ్చేశారు.

పుట్టా మధు అక్రమంగా 900 కోట్లు సంపాదించినట్లు ఆరోపిస్తూ దర్యాప్తు సంస్థలకు కాంగ్రెస్ నేత మంథని మాజీ ఉప సర్పంచ్ ఎనుముల సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి ఆస్తులపై దాడులు జరిగిన మరుక్షణంలో పుట్టా మధు ఆస్తుల గురించి మీడియాలో ప్రచారం షూరూ అయింది. ఫిర్యాదుదారుడు సత్యనారాయణ ఈ మేరకు టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పై ఐటి, సీబీఐ, ఇడి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో ఉన్న వివరాలివి.

జూబ్లిహిల్స్ లో సినీ నటుడు శ్రీ హరి ఇంటి పక్కనే 5 కోట్ల విలువ చేసే ఇల్లును మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కొనుగోలు చేశారు.

తల్లి పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కోట్లు వసూళ్లు చేశారు.

పుట్టా మధు 900 కోట్లు అక్రమంగా సంపాదించారు.

అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ లలో 100 కోట్ల విలువైన పెట్టుబడులు హోటల్స్, నిర్మాణ రంగంలో పెట్టుబడి పెట్టారు.

ముంబైలోని ఆది రాజ్ కన్స్ట్రక్షన్స్ పేరుతో పుట్ట మధు 50 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

కాటారం మండలం ఒడిపిలవంచలో 2 కోట్లు విలువ చేసే 50 ఎకరాల వ్యవసాయ భూమి సంపాదించారు.

పలివెల మండలం మహాదేవపూర్ లో నాలుగు కోట్లు విలువ చేసే 100 ఎకరాల వ్యవసాయ భూమి సంపాదించారు.

జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో పుట్ట మధు  తన క్లాస్ మేట్ శ్రీనివాస్ బినామీ పేరుతో భువన సురయి డెవలపర్స్ లో 100 కోట్లతో పెట్టుబడులు పెట్టారు.

తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఇసుక క్వారీ ని పుట్టా మధు సోదరుడు పుట్ట సత్యనారాయణ పేరుతో నడుపుతున్నారు. దీని టర్నోవర్ 50 కోట్ల వరకు ఉంటుంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భవిత శ్రీ చిట్ ఫండ్స్ 20 బ్రాంచేస్ లో పుట్ట మధు 50 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

మంథని మండలం విలోచవరం లో 60 లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు.

మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో 40 ఎకరాల ల్యాండ్, దాంట్లో 40 కోట్లతో మెడికల్ కాలేజి నిర్మిస్తున్నారు పుట్టా మధు.

పుట్టా మధు ఆస్తులపై ఇప్పుడు విచారణ జరుగుతుందా? లేదా అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

దర్యాప్తు సంస్థలకు కాంగ్రెస్ మాజీ ఉప సర్పంచ్ సత్యనారాయణ చేసిన ఫిర్యాదు కాపీ లింక్ కింద ఉంది చూడండి.

Representation to IT Commissioner