వాళ్ల ఆత్మ విశ్వాసం ఏమో గాని, కాంగ్రెస్ పార్టీలో ప్రతిచోట పండగవాతావారణ కనిపిస్తావుంది. కెసిఆయర్, కెటిఆర్, కవిత, హరీష్ రావు మాదే ప్రభుత్వం, మేమే మళ్లీ వస్తున్నాం అని పదే పదే చెబుతున్నా, కాంగ్రెస్ నేత ల్లో ఎక్కడా నిరుత్సాహం కనిపించడం లేదు.
గ్రామస్థాయిలలో పెద్ద ఎత్తున ఇతర పార్టీలనుంచి, చవరకు రూలింగ్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ జండా పండగలయిన చెప్పనలవికాదు, చాలా గొప్పగా సాగుతున్నాయి.
పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరిస్తున్నార, జనమూ అలాగేవిరగబడి కాంగ్రెస్ మీటింగ్ లకు వస్తున్నారు. ఇదిగో కాంగ్రెస్ నేత ఇంద్రక్క ఎలా హల్ చల్ చేస్తున్నదోచూండి…
ధర్మసాగర్ మండలం ధర్మాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ ఎంత జోష్ తో జరుపుకున్నారు. కోలాట మాడుతూ భారీ డప్పుల చప్పుళ్లతో పండగవాతావరణం సృష్టించారు. ఇంద్రక్క ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను వివరించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నారు. స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి సింగపురం ఇందిరగ్రామస్తులతో కలిసి జెండా పండుగను భారీ ఎత్తున నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
ధర్మసాగర్ మండల నాయకులు ధర్మాపురం గ్రామ నాయకులు మహిళల యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో ఇంత ఉత్సాహం రావడానికి కారణమేమయి ఉంటుంది?