మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేనట్టేననే సంగతి తెలిసిందే. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం ఎప్పటికీ జరగదు. చిరంజీవి రాజకీయాలపై దృష్టి పెట్టాలని అనుకుంటే జనసేన పార్టీ ఉందనే విషయం తెలిసిందే. తమ్ముడు పవన్ కళ్యాణ్ సైతం చిరంజీవి జనసేనలోకి రావాలని కోరుకుంటున్నారు. అయితే జనసేన పార్టీపై అభిమానం ఉందనేలా చిరంజీవి డైరెక్ట్ గా ఎప్పుడూ కామెంట్లు చేయలేదు.
అయితే చిరంజీవి జనసేన పార్టీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని మెగా అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ లో పార్టీ పేరు జనసమితి పార్టీగా ఉంది. ఈ పార్టీ పేరు జనసేనకు దగ్గరగా ఉండటంతో తమ్ముడి పార్టీకి అన్నయ్య సపోర్ట్ చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. ఈ కామెంట్లపై మెగాస్టార్ చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
చిరంజీవి పవన్ కలిస్తే మాత్రం జనసేనకు కచ్చితంగా ప్లస్ కావడంతో పాటు జనసేన మెరుగైన సీట్లను సాధించే అవకాశం అయితే ఉంటుంది. పవన్ కళ్యాణ్ పార్టీ తరపున చిరంజీవి పోటీ చేస్తే మాత్రం ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. చిరంజీవి మాత్రం రాజకీయాలపై తాను దృష్టి పెట్టనని పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే కొన్నిసార్లు కాలంతో పాటు మారాల్సి ఉన్న నేపథ్యంలో చిరంజీవి రాజకీయాలపై దృష్టి పెట్టి సక్సెస్ కావాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. రీఎంట్రీలో కూడా చిరంజీవి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సీనియర్ హీరోలలో ఏ హీరోకు లేని స్థాయిలో చిరంజీవికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా మెగాస్టార్ రెమ్యునరేషన్ ఏకంగా 40 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ఆయన టార్గెట్ ఎవరు అవుతారో చూడాల్సి ఉంది.