టిఆర్ ఎస్ కు షాక్, చెవేళ్ల ఎంపి కొండా రాజీనామా?

తెలంగాణలో టికెట్ రాకపోవడం తో అన్ని పార్టీలలో నడుస్తున్నరాజీనామా డ్రామలో మరొక కొత్త ఎపిసోడ్ ఈ రోజు చోటుచేసుకుంది.

చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారనే వార్త గుప్పుమంది.

రాజీనామా లేఖను  ఆయన ముఖ్యమంత్రి కెసియార్ కు పంపించారని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది.

ఇదే నిజమయితే, ఉన్నత స్థాయిలో పార్టీకి ఇలా  ఎన్నికల ముందు రాజీనామా ఎదురు కావడం ఇదే  ప్రథమం.

పాార్టీ ధోరణి ఆయన కు నచ్చక చాలా కాలంతా  పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారనేది వాస్తవం.

పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నా  కొండా పత్తా లేరక్కడ. చివర మంత్రి మహేందర్ రెడ్డి ఏరియాకు వచ్చినా ఆయన ప్రచారంలో పాల్గొనలేదు.

నిజానికి ఇద్దరు ఎంపిలు టిఆర్ ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రస్ లోకి వస్తున్నారని అనగానే  కొండా పేరే ప్రచారంలోకి వచ్చింది. ఆయన నిన్న తాండూరు లో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఇద్దరు ఎంపిలు టిఆర్ ఎస్ కు గుడ్ బై కొడుతున్నారని అడగ్గానే ఆయన ఇద్దరు కాదు, ముగ్గురు అని వెళ్లి పోయినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఆయన కాంగ్రెస్ తరఫున చెేవెళ్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారనే మాట వినిపిస్తావుంది. సోనియా గాంధీ రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు ఆయన కాంగ్రెస్ లో చేరతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, ఈ వార్తను ఆయన ఖండిస్తున్నారు.

‘నేను టిఆర్ ఎస్ కు రాజీనామా చేశాను అన్న వార్త అవాస్తవం. .నేను కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి వచ్చాను. రేవంత్ రెడ్డి కావాలని నా పై దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు అలాంటి ఆలోచన లేదు,’ అని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చె ప్పారు.