అద్భుత పాచిక విసిరిన చంద్రబాబు .. ఇక జగన్ నిండా మునగడం ఖాయం ?

Senior TDP leader disappointed with other leaders

చంద్రబాబు … దేశ రాజకీయాల్లో అత్యంత అనుభవం ఉన్న నేత. అపరచాణిక్యుడు , వ్యూహం సిద్ధం చేస్తే ఎదుటివారి దిమ్మతిరిగిపోవాల్సిందే. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా కూడా నిత్యం ఏదో ఒక అంశంపై చంద్రబాబు.. టీడీపీ నాయ‌కుల‌తో చ‌ర్చలు జ‌రుపుతూనే ఉన్నారు. జిల్లాలు, మండలాలు, నియోజ‌క‌వ‌ర్గాలు, గ్రామాలు ఇలా పార్టీలో అన్ని వ‌ర్గాల‌కు ఆయ‌న నిత్యం ఏదో ఒక రూపంలో క్లాస్ లు తీసుకుంటున్నారు. అనేక విషయాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే.. అదే స‌మయంలో త‌న అనుకూల మీడియాకు కూడా చంద్రబాబు బ్రీఫింగ్ ఇస్తున్నార‌ని టీడీపీలో చ‌ర్చ సాగుతోంది.

Chandrababu Naidu should take care about this issue 
 

మొదటి నుండి అనుకూల మీడియాతో నిత్యం ట‌చ్‌ లో ఉండేవారు చంద్రబాబు. కానీ, పార్టీ ఓట‌మి త‌ర్వాత‌.. ఒకింత అనుకూల మీడియాపై ఆయ‌న గుస్సాగా ఉన్నారు. అనుకూల మీడియాలో త‌న‌ను ప్రొజెక్టు చేయ‌డంలో కొంత వెనుక‌బాటు క‌నిపించింద‌నేది చంద్రబాబు ఆవేద‌న‌. పార్టీ ఘోరంగా ఓడిపోయాక టీడీపీకి ఎంత భ‌జ‌న చేసినా ఛానెల్స్‌కు రేటింగ్ కూడా రాక‌పోవ‌డంతో టీడీపీ కార్యక్రమాలు హైలెట్ చేయడం కాస్త త‌గ్గించారు. అమరావ‌తి ఉద్యమాన్ని టీడీపీ అనుకూల మీడియా ఎంత మోసినా ఊపు రాక‌పోవ‌డ‌మే ఓ ఉదాహ‌ర‌ణ.

ఇక చంద్రబాబు కూడా గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత హైద‌రాబాద్‌లోనూ ఉంటూ కొన్నాళ్ల పాటు.. మౌనంగా ఉన్నారు. ఇక‌, ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ దూకుడు పెర‌గ‌డం.. టీడీపీ త‌మ్ముళ్లు పార్టీ కార్యక్రమాల‌కు కూడా దూరం కావ‌డంతో చంద్రబాబు ఇటు పార్టీని.. అటు అనుకూల మీడియాను కూడా మేనేజ్ చేస్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది.చంద్రబాబు క‌నుస‌న్నల్లోనే క‌థ‌నాలు వ‌స్తున్నాయ‌ని త‌మ్ముళ్లు చ‌ర్చించుకుంటున్నారు. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ దూకుడుగా ఉండ‌డం, వివిధ ప‌థ‌కాలు అమ‌లు చేస్తుండ‌డంతో ప్రజ‌ల దృష్టిని మ‌ళ్లించేలా క‌థ‌నాలు రాయిస్తున్నార‌ని టీడీపీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే చంద్రబాబు చేసే ఈ ప్రయత్నాలు ఎంతవరకు టీడీపీ కి , చంద్రబాబుకి మేలు చేస్తాయో చూడాలి.