జనసేన అజండా…చంద్రబాబునే అడగండి

జనసేనకు జండాలేదు, పవన్ కు అజండాలేదు అని విమర్శిస్తున్నవారికి ఈ రోజు జనసేనాని పవన్ కల్యాణ్ జవాబిచ్చారు. శనివారం నాడు ఆచంటకు వచ్చారు. అక్కడ తనకు లభించిన అపూర్వ స్వాగతానికి ధన్యవాదాలు తెలిపారు.

రాజకీయనాయకులంతా మాట తప్పుతున్నారు, ఇదిచూల్లేక కడుపుమండి బాధతో రాజకీయాల్లోకి వచ్చానని ఆయన ప్రకటించారు.

‘నేను వచ్చింది మన దేశానికి, సమాజానికి ఏదైనా చేయాలని, సినిమా అనేది వృత్తి, రాజకీయలనేవి బాధ్యత,’ అని ఆయన హర్షధ్వానాల మధ్య చెప్పారు. 

భీమవరంలో డంపుయార్డ్ ను పరిశీలించిన పవన్ కల్యాణ్

జనసేనకు జండా లేదు, అజెండా లేదని ఆచంట శాసన సభ్యుడ పితాని సత్యానారాయణ అనడం ప్రస్తావిస్తూ …‘‘ఆచంట శాసన సభ్యులు, పెద్దలు పితాని గారికి ఒకటే తెలియచేస్తున్నా.  జనసేన జెండా, మా అజెండా ఎంటో తెలియకపోతే మా ఆఫీస్ కి వచ్చిన మీ ముఖ్యమంత్రి , తెదేపా నాయకులని అడిగి తెలుసుకోండి,’ చమత్కరించారు.  జిల్లాలో 15కు 15 సీట్లు టిడిపికి ఇప్పించిందే తానే నని చెబుతూ ఇలాంగటి జిల్లాలో టిడిపి చేత తిట్టు తినాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘ఓట్లు చీలకూడదు,చంద్రబాబు నాయుడు  అనుభవజ్ఞుడు,రాష్ట్రానికి  అవసరం అని జనసేన నాడు మద్దతిస్తే ఈ రోజు పితాని లాంటి పెద్దలతో తిట్టించుకోవలసి వచ్చింది,’ అని అన్నారు.

‘వైసీపీ గెలవాల్సిన ఎన్నికల్లో టీడీపీ ఎలా గెలిచిందో మీ ముఖ్యమంత్రిని అడిగితే చెప్తారు. జనసేన బలం ఎంతో అనేది ఆయన్నే అడగండి’అని కూడా పవన్ చెప్పారు.

‘‘తిడితే పడతాం, పవన్ కళ్యాణ్ గాని, జనసైనికులు గాని దేశభక్తి కలిగిన వ్యక్తులు, దోపిడీలు చేయని వారు, కానీ మీరు దోపిడీలు చేస్తూ, ప్రశ్నించిన వారిని తిడుతూ ఉంటే చూస్తూ కూర్చోమ్,’ అని పవన్ హెచ్చరించారు.

‘ చంద్రబాబు గారూ, తప్పులు జరుగుతున్నాయి, సరిచేసుకోండి అని 2014 నుంచి నేను చెబుతూనే ఉన్నాను, కానీ పట్టించుకోలేదు అందుకే నేను ఈరోజు మీ తప్పులను ప్రశ్నిస్తున్నాను,’అని తన యు టర్న్ గురించి వివరించారు. 

 ష

నెహ్రు గారు చెప్పిన రైస్ బౌల్ లాంటి గోదావరి జిల్లాలను కాలుష్య కోరల్లోకి నెట్టేస్తుంటే కడుపుమండి మాట్లాడుతున్నాను. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు చేయండి అని చెప్తే పవన్ కళ్యాణ్ చెడ్డవారు అయిపోయాడు, అదే మీకు అనుకూలంగా ఉంటే మంచివాడా? అని ఆయన ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి

కాపు రిజర్వేషన్ల మీద క్లారిటి ఇచ్చిన వపన్