Chandra Babu: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య మంత్రులలో ఎవరు అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రిగా ఉన్నారనే విషయంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం అత్యంత ధనవంతులైనటువంటి ముఖ్యమంత్రిగా జాబితాను విడుదల చేయగా అందులో చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలో నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలో చోటు సంపాదించుకోవడం పట్ల విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు చరాస్తుల విలువ రూ.810 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ రూ.121 కోట్లు.
రూ. 332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రెండో స్థానంలో, రూ. 51 కోట్ల ఆస్తులతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మూడో స్థానంలో నిలిచారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడో స్థానంలో ఉండగా చివరి స్థానంలో మమత బెనర్జీ నిలిచారు. ఇక చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలో ఉండగా ఆయన విస్తారమైన సంపద కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు, పెట్టుబడులకు కారణమని చెప్పవచ్చు.
మరోవైపు మాత్రం ఈయన మొదటి స్థానంలో ఉండడంతో కొంతమంది వైకాపా నాయకులు ఈయన ప్రత్యర్థులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున దోపిడీ చేసి సంపాదించిన ఆస్తులేనని కామెంట్లు చేస్తున్నారు. ఆయన రాజకీయాలలోకి వచ్చినప్పుడు కేవలం రెండే ఎకరాల పొలం మాత్రమే ఉండేది. అలాంటిది ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు సొంతం చేసుకొని అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలో ఉన్నారంటూ విమర్శిస్తున్నారు.
