40 ఇయర్స్ ఇండస్ట్రీ… ఇంజినీర్ అవ్వాలంటే బైపీసీ చదవాలి!

చంద్రబాబులో ఎంతో మార్పొచ్చిందనే కామెంట్లు గతకొంతకాలంగా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… అల్జీమర్స్ వ్యాధిని గుర్తు చేశారు. మరికొంతమంది చంద్రబాబు కు మానసిక పరిస్థితి బాగాలేదని అంటున్నారు. అందుకు పలు కారణాలు తెరపైకి తెస్తున్నారు.

అవును… చంద్రబాబు మానసిక పరిస్థితి బాగాలేదని, అందుకు కారణం ఆయన వయోభారం అని కొందరంటే, అల్జీమర్స్ అని వైసీపీ నేతలు అంటుంటే, వంశపారపర్యం అని కొంతమంది చెబుతున్నారు. ఈ సమయంలో ఇప్పటికే “సైకిల్ పోవాలి” అని చంద్రబాబు ఇప్పటికే చెప్పేసిన పరిస్థితి.

ఈ క్రమంలో తాజాగా మరోసారి ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీలో చేరాలనే కామెంట్ చేశారు చంద్రబాబు. బీకాం లో ఫిజిక్స్ ఉంటుందని చెప్పిన విషయమే ఇప్పటివరకూ వైరల్ కాగా… ఇప్పుడు తాజాగా ఇంజినీర్ అవ్వాలంటే బైపీసీలో చేరాలేనే కామెంట్లు మరింత వైరల్ అవుతున్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌ కి విజన్‌-2029 డాక్యుమెంట్‌ ను చంద్రబాబు రూపొందించినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అమరావతి ప్రాజెక్ట్ చేతపట్టి రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశారని అంటుంటారు. ఫలితంగా 2029 సంగతి దేవుడెరుగు.. 2019 ఎన్నికల్లో ప్రజలు అత్యంత ఘోరంగా.. పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఓడించారు!

ఈ సమయంలో గెలుపు అనివార్యం అయిన నేపథ్యంలో మరోసారి కొత్త విజన్ ని తెరపైకి తెచ్చారు చంద్రబాబు. ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థల్లో తాజాగా భారతదేశం ఐదో స్థానానికి వచ్చిందని ప్రధాని ఎర్రకోటపై ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పంచ వ్యూహాలతో విజన్‌-2047 డాక్యుమెంట్‌ ను రూపొందించినట్లు చెప్పుకొస్తున్నారు చంద్రబాబు.

దీనికి సంబంధించి ఒక సభను విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ సభా ప్రాంగణలో వేసిన కుర్చీల్లో నూటికీ 90శాతం ఖాళీగా ఉన్నాయనేలా వీడియోలు దర్శనమిస్తున్నాయి. వచ్చిన జనం సంగతి అలా ఉంటే… ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరింత అధ్వాన్నంగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

దీంతో… యువగళం యాత్ర పేరుచెప్పి నారాలోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు ఒకెత్తు అయితే.. తాజాగా ఇంజినీర్ అవ్వాలంటే బైపీసీ చదవాలనే చంద్రబాబు మాటలు మరొకెత్తు అని.. విజనరీ సంగతి కాసేపు పక్కనపెడితే… ఆరోగ్యపరిస్థితిపై దృష్టి సారించాలని పలువురు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా… తనదైన విజన్ తో “పార్టీ లేదు %@$#@ లేదు” అని ఆ పార్టీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు ఏపీ ప్రజలు!

#@AKnewschannel Chandrababu In Vizag 2047 Vision