చంద్రబాబు ఫిమేల్ వెర్షన్… ఉస్కో డిస్కో అంట!

గతకొన్ని రోజులుగా ఏపీ పాలిటిక్స్ లో రేణుకా చౌదరి హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు కారణం… ఆమెకు ఏపీ రాజకీయాలపై కొత్తగా పుట్టుకొచ్చిన ఆసక్తో.. లేక, తెలంగాణ రాజకీయాల్లో కనుమరుగవుతున్న ఆమె ప్రసక్తో.. తెలియదు కానీ.. జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు! ఈ క్రమంలో… జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం గమనార్హం! దీంతో రేణుకా చౌదరిని తీవ్రస్థాయిలో విమర్శించారు వైకాపా మహిళా నేత రజనీ చౌదరి!

తాజాగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రేణుకా చౌదరి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మకు శాంతి లేకుండా జగన్ చేస్తున్నారని.. గతంలోనూ జగన్ పిచ్చి వేషాలు వేసేవారని, ఆ విషయాలను తండ్రిగా వైఎస్సార్ బయటకు రాకుండా కాపాడారని రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు.

అక్కడితో ఆగని రేణుక… రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని.. ఏపీలో రౌడీయిజం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కలరాస్తున్నారని.. నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని చెప్పుకొచ్చారు. దీంతో… జగన్ ని నిత్యం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమే పనిగా పెట్టుకున్న టీడీపీ నేతల సరసన ఆమె కూడా చేరే ప్రయత్నం చేసిందనే కామెంట్లు వెలువడుతున్నాయి.

దీంతో మైకందుకున్న వైకాపా మహిళా నేత రజనీ చౌదరి.. రేణుకా చౌదరి ఒక రాక్షస చౌదరి అని.. ఆమె మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని.. ఆమె నోరు అదుపులోపెట్టుకోకపోతే బడితపూజ తప్పదని ఫైరయ్యారు. ఇదే క్రమంలో… ఒకవైపు విశాఖలో పెట్టబడుల సదస్సు జరుగుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని, ఆ సదస్సును పక్కదారి పట్టించడానికే రేణుకా చౌదరిని వదిలాడని విమర్శించారు రజనీ చౌదరి.

ఏనుగు వెళ్తుంటే రేణుకా చౌదరి వంటి కుక్కలు మొరుగుతూనే ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె… రేణుకా చౌదరి అంటే చంద్రబాబుకు ఫిమేల్‌ వెర్షన్‌ అని విమర్శించారు. దీనికి తోడుగా… చంద్రబాబు ఉస్కో అంటే రేణుకా చౌదరి డిస్కో అంటుందని.. ఆ డిస్కో వేషాలు జగన్ దగ్గర చేస్తే తోకలు కత్తిరిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు వైకాపా సోషల్ మీడియా యాక్టివిస్టులు!

YouTube video player