పవన్ సీటు కన్ఫాం చేసిన చంద్రబాబు!

టీడీపీ – జనసేనల పొత్తు అధికారికంగా కన్ ఫాం కాకపోయినా… అనధికారికంగా అయితే ఎప్పుడో కన్ ఫాం అయిపోయిన సంగతి తెలిసిందే. కాకపోతే పొత్తులో భాగంగా ఎవరెన్ని సీట్లలో పోటీచేస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఈ విషయంలో చంద్రబాబు దయ.. పవన్ ప్రాప్తం అన్నట్లుగా వ్యవహారం ఉండొచ్చని కథనాలొస్తున్నాయి. అయితే ఈ విషయంలో పవన్ ఏ సీటు నుంచి పోటీ చేస్తారనేవిషయాన్ని టీడీపీ ఆల్ మోస్ట్ కన్ ఫాం చేసిందని తెలుస్తుంది.

వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీచేసే స్థానాలపై ఇన్ని రోజులుగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతసారిలా రెండుచోట్ల పోటీచేస్తారా? లేకుంటే ఒకేచోట బరిలో దిగుతారా? అన్నదానిపై గత కొద్దిరోజులుగా ఆన్ లైన్ వేదికగా విపరీతమైన చర్చ సాగుతోంది. అయితే ఈ విషయంలో ఇంక సాగదీత పనికిరాదని బాబు-పవన్ లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈసారి రెండు చోట్ల నుంచి వద్దు.. ఒకే చోట నుంచి పోటీ చేయమని బాబు.. పవన్ కు సూచించినట్లు తెలుస్తుంది.

గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాలనుంచి పవన్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్లా పవన్ ఓడిపోయారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీకి బలమైన నేతలే ఉన్నారు. గాజువాక విషయంలో పల్లా శ్రీనివాసరావు రూపంలో బలమైన అభ్యర్థి టీడీపీకి ఉన్నారు. ఇక భీమవరంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పులపర్తి రామాంజనేయులు ఉన్నారు. అయితే వీరిలో భీమవరం ఎమ్మెల్యేని బాబు కన్ వెన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో గాజువాక విషయంలో పల్లా శ్రీనివాసరావుకు సీటు కన్ ఫాం అని బాబు భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది.

రాబోయే ఎన్నికల్లో గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థిని పోటీకి పెట్టాలని భావిస్తున్న బాబు… పవన్ ని భీమవరం నుంచి పోటీ చేయాలని సూచిస్తున్నారంట! ఇదే సమయంలో గాజువాకతో పోలిస్తే భీమవరం సేఫ్ అని కూడా చెబుతున్నట్లు సమాచారం. పైగా గడిచిన ఎన్నికల్లో గాజువాకతో పోలిస్తే భీమవరంలో పవన్ కి ఓట్ల శాతం అధికంగా వచ్చాయి. ఇది కూడా ఒక కారణంగా బాబు సూచిస్తున్నారంట. సో… రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్… భీమవరం నుంచి పోటీ చేస్తారనే విషయం ఆల్ మోస్ట్ కన్ ఫాం అయిపోయినట్లే! అధికారికంగా ప్రకటించడమే మిగిలిఉంది!!

కాగా… గడిచిన ఎన్నికల్లో భీమవరంలో గ్రంథి శ్రీను చేతిలో పవన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈస్థానంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీను కి 70,642 ఓట్లు వస్తే… పవన్ కు 62,285 ఓట్లు వచ్చాయి.