వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు.. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు.! వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.. నారా లోకేష్ కూడా ముఖ్యమంత్రి అవుతారు.! మరి, ఎవరు అరెస్టవుతారబ్బా.?
టీడీపీ – వైసీపీ మధ్య నడుస్తున్న పొలిటికల్ ఈక్వేషన్స్ తాలూకు గొడవ సారాంశమిది. త్వరలో చంద్రబాబు అరెస్టవుతారని జోస్యం చెబుతోంది వైసీపీ. చంద్రబాబే కాదు, రామోజీరావు కూడా అరెస్టవడం ఖాయమని వైసీపీ గట్టిగా చెబుతోంది. అది సాధ్యమేనా.?
ఏం, ఎందుకు కాదు.? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.! కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ కాస్త గట్టిగా తలచుకుంటే, చంద్రబాబు అలాగే రామోజీరావు.. ఇద్దరూ జైలుకి పోతారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అంతెందుకు, వైసీపీ గట్టిగా తలచుకుంటేనే ఆ పని జరిగిపోతుంది. కానీ, ఎందుకు తలచుకోవడంలేదట.?
చంద్రబాబు అరెస్టయితే, టీడీపీకి సింపతీ వస్తుంది. పైగా, నడుస్తున్నది ఐటీ కేసు.! సో, అరెస్టు అంత తేలిక కాదు.! నోటీసులిచ్చారు, వివరణ ఇస్తే సరిపోతుంది. లెక్కలు చూపించలేకపోతే, ఏవో కాకి లెక్కలు చూపించేసి.. పన్నులు కట్టేస్తే.. కేసు ఖతమ్.! ఇంత చిన్న కేసుగా దీన్ని చాలామంది చూస్తున్నారు.
రామోజీ వ్యవహారం వేరు.! ఏమో, ఆ కేసు విషయంలో ఏమైనా జరగొచ్చు. ఇక, చంద్రబాబు అరెస్టయితే, వెంటనే లాభపడేది నారా లోకేష్. రాజకీయంగా అది లోకేష్‌కి అడ్వాంటేజ్ అవుతుంది. ఈ విషయాన్ని వైసీపీ కూడా పరోక్షంగా ఒప్పుకుంటోందాయె.! తన కొడుకుని సీఎంని చేయడానికి చంద్రబాబు స్వయంగా అరెస్టయ్యేందుకూ సిద్ధమేనేమో.! అలాగని టీడీపీలోనూ చర్చ జరుగుతోంది.
ఇవన్నీ జస్ట్ అంచనాలు మాత్రమే. ఈక్వేషన్ తేడా కొడితే, మొత్తంగా చంద్రబాబు అలాగే లోకేష్ రాజకీయ జీవితం ఇక్కడితో ముగిసిపోవచ్చు.!