తన భార్యను అసెంబ్లీలో ఏదో అన్నారని మైకులముందుకు వచ్చినె చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. మహిళలపట్ల వైసీపీ నేతలకు గౌరవం లేదంటూ బోరుమన్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబసభ్యులపైనా, స్వాయంగా జగన్ భార్యపైనా టీడీపీ మాత్రం నీచమైన పోస్టులు పెడుతుంది.
కొంతకాలంగా స్వాతిరెడ్డి అనే పేరుతో ఉన్న ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి వైసీపీ నేతల పైనా, ఏకంగా ముఖ్యమంత్రిపైన కూడా విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జగన్ భార్య భారతి పై కూడా దిగజారుడు పోస్టులు పెడుతున్నారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా జనాలు ఆ అకౌంట్ పై దృష్టి సారించారు.
ఆమె బాగోతాలను బహిర్గతం చేయడం మొదలుపెట్టారు. ఎక్కడో విదేశాల్లో ఉండి, భారతీయ చట్టాలు తమకు వర్తించవనే ధైర్యంతో ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్న యువతిని వాయించివదిలిపెట్టడం మొదలుపెట్టారు. కౌంటర్ పోస్టులతో ఊపిరి ఆడనివ్వకుండా చేయడం మొదలుపెట్టారు. దీంతో లైవ్ లో కి వచ్చి బోరుమనడం మొదలుపెట్టింది. పనిలో పనిగా జగన్ ను తిట్టిపోసింది.. చంద్రబాబును ఆకాశానికెత్తింది.
ఈ విషయం తనదృష్టికి రావడంతో చంద్రబాబు సడన్ గా పెద్దమనిషి అవతారం ఎత్తారు! సదరు యువతికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఈ మేరకు ఇది భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగమని, అది ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అంటూ కొత్త భాష్యం చెప్పారు. అసత్యాలు, దుష్ప్రచారాలతో భయపెట్టాలనుకునే వైసీపీ వ్యూహాలు ఆమె లాంటి బలమైన వ్యక్తుల సంకల్పాన్ని దెబ్బతీయలేవంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
దీంతో… ఇంతకాలం వైసీపీపై అక్కసు వెళ్లగక్కుతున్న ఈ యువతి వెనక చంద్రబాబు ఉన్నారనే విషయం స్పష్టం అయ్యిందని తెలుస్తుంది. చంద్రబాబు మరీ ఇంత దిగజారిపోయి వ్యవహరిస్తున్నారా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ముఖ్యమంత్రి జగన్ పైనా, ఆయన భార్యపైనా ఇలా ఆన్ లైన్ లో నిస్సిగ్గు పోస్టులు పెట్టడం భావ ప్రకటనా స్వేచ్చలో భాగమైతే… చంద్రబాబు భార్యపై వైసీపీ నేతలు కామెంట్లు చేయడం కూడా ఆ ప్రజాస్వామ్యమిచ్చిన హక్కులో భాగమనే అనుకోవొచ్చుగా అంటూ ఫైరవుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… ఈమె అసలు నామధేయం శ్వేతా చౌదరి అయితే… స్వాతిరెడ్డిగా పేరు మార్చుకుని ఈ రచ్చంతా చేస్తుందని తెలుస్తుంది. ఏది ఏమైనా… ఈ వ్యవహారం ఇప్పుడు శ్వేతా చౌదరి అలియాస్ స్వాతిరెడ్డి, చంద్రబాబుల చేతులు దాటిపోయింది.. ఇకవైసీపీ సోషల్ మీడియా జనాలు ఏ రేంజ్ లో వాయించి వదులుతారు.. డోస్ ఇంకాస్త పెంచుతారా.. లేక, బురదలో రాయివెయ్యడం ఎందుకని వదిలేస్తారా.. లేక ఆమెకు జ్ఞానం వచ్చేవరకూ వెంటాడతారా అనేది వేచి చూడాలి!