హరికృష్ణ పాడె మోసిన రిటైర్డ్ జడ్జి, చంద్రబాబు (వీడియో)

హరికృష్ణ అంతిమయాత్రలో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా తన బావమరిది హరికృష్ణ పాడే మోశారు. ఓ వైపు చంద్రబాబు మరోవైపు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పాడె పట్టుకున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, కుటుంబ సభ్యులు అశ్రునయనాలతో ముందు నడిచారు. హరికృష్ణ పాడె మోసిన చంద్రబాబు వీడియో కింద ఉంది చూడండి.

హరికృష్ణ అమర్ రహే అంటూ అభిమానులు నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. అక్కడి నుంచి హరికృష్ణ భౌతిక కాయాన్ని వైకుంఠ రథం ఎక్కించారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో కూడా చంద్రబాబు, బాలకృష్ణ హరికృష్ణ పాడె మోశారు. 

హరికృష్ణ పాడె మోస్తున్న చంద్రబాబు, జస్టిస్ చలమేశ్వర్