చంద్రబాబు ఇలా.! జనసేనపై తెలుగు తమ్ముళ్ళు అలా.!

తెలుగుదేషశం పార్టీ అధినేత నారా చంద్రబాబుది రెండు కళ్ళ సిద్ధాంతం.. రెండు నాల్కల సిద్ధాంతం.. అని చాలా సందర్భాల్లో వింటుంటాం. చంద్రబాబు ఒకటి మాట్లాడతారు, తెలుగు తమ్ముళ్ళు ఇంకోలా వ్యవహరిస్తుంటారు. ఏ విషయంలో అయినా టీడీపీది ఇదే విధానం.!

జనసేనతో పొత్తుకు వెళ్ళాలన్నది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యూహం. కానీ, టీడీపీ అనుకూల మీడియా అలాగే తెలుగు తమ్ముళ్ళు.. జనసేనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అను‘కుల’ మీడియా అంటే, చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తుంటుంది. ఇక తెలుగు తమ్ముళ్ళ సంగతి సరే సరి.!

జనసేన పార్టీకి దాదాపు 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా వున్న మాట వాస్తవం. కానీ, పది నుంచి పదిహేను సీట్ల కంటే ఎక్కువ ఇచ్చేది లేదని తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో తెగేసి చెబుతున్నారు. అంతేనా, జనసేన మీద నానా రకాల మాటలతో తూలనాడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు.

‘మాకేం అవసరం.? మాకు జనసేనతో పొత్తు అవసరమే లేదు..’ అంటున్నారు టీడీపీలో కొందరు నేతలు. దానికి కౌంటర్ ఎటాక్ ఇచ్చే క్రమంలో జనసేన నేతలూ ఘాటుగానే స్పందిస్తున్నారు. టీడీపీ – జనసేన కలిసే ఆడుతున్న డ్రామాగానూ ఈ గిల్లికజ్జాల వ్యవహారాన్ని చూడాల్సి వుంటుందేమో. లేకపోతే, వ్యవహారం ఇంత హాటుగా నడుస్తోంటే, జనసేన అధినేత ఎందుకు సీన్‌లోకి రాకుండా వుంటారు.?