రాజధాని షిఫ్ట్ బిహైండ్ ది స్టోరి!
అమరావతి నిర్మాణంపై ఆలోచిస్తాం. ప్రభుత్వం చర్చిస్తోంది! నీట మునకలు వేసే చోట నిర్మాణాలు సురక్షితం కాదు!! అంటూ బిగ్ బాంబ్ వేశారు ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. నీట మునిగిన భవంతుల్ని చూపిస్తూ చాలానే రచ్చ చేశారు. అంతేకాదు రాజధాని మారపుతో సగం ఖర్చును తగ్గించేస్తామని స్పష్టంగా ప్రకటించారు బొత్స. దీంతో రాజధాని షిఫ్ట్ కి వైకాపా కుట్ర పన్నుతోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుయాయులు మీడియా ముందు లవోదిబోమన్నారు. ఇప్పటికే 50 శాతం మేర భవంతుల నిర్మాణాలు పూర్తయ్యాక ఇప్పుడీ షిఫ్ట్ ఏమిటో అంటూ అందరూ తలలు పట్టుకున్నారు. ముఖ్యంగా గుమ్మడికాయ దొంగల్లా తేదేపా నాయకులు భుజాలు తడుముకోవడం చర్చకొచ్చింది. రాజధాని విషయంలో అసలేం జరుగుతోందో అర్థం గాక 35వేల ఎకరాల్ని తేదేపా ప్రభుత్వానికి ధారదత్తం చేసిన వందలాది రైతులు ఖంగు తిన్నారు. భారీ మల్టీప్లెక్సులు కట్టి వాటిల్లో తమకు కూడా వాటాలు ఇస్తారని, కాంప్లెక్స్ అద్దెలతోనే కాస్ట్ లీగా విలాసాల్లో మునిగి తేలొచ్చని భావించిన కొందరికి ఈ వ్యవహారం అస్సలు మింగుడు పడడంలేదు. అయితే అంతకుమించి రైతుల వద్ద నుంచి కారు చౌకగా భూములు కొట్టేసిన చాలా మంది బడాబాబులకు గుండెలు పగిలిపోయాయ్. కొందరైతే రాజధాని షిఫ్ట్ అన్న మాట వినగానే ఉరికి వేలాడినట్టు గిలగిలలాడిపోవడం స్పష్టంగా కనిపించింది. రాజధాని చుట్టూ పాగా వేసన రియల్ వెంచర్లు అన్నీ గిజగిజలాడాయి.
అసలు ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం నిర్మించే కట్టడాలా ఇవి? లేదా టీడీపీ నాయకులే రియల్ వెంచర్లతో కుమ్ముకోవడానికి కడుతున్న రాజధానినా ఇదీ? అంటూ టీవీ చానెళ్లు డిబేట్లతో వేడెక్కించాయి. ఇక రాజధాని చుట్టూ భూములు కొట్టేసిన బడాబాబుల్లో పలు టీవీ చానెళ్ల ఓనర్లు.. పత్రికాధిపతులు కూడా ఉన్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇన్ సైడ్ ట్రేడింగ్ తో భారీగా భూములు కొట్టేసిన దగుల్బాజీ పెద్దలందరికీ గుండెల్లో గునపం దిగినట్టయ్యింది. దీంతో పత్రికలు- టీవీల్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. ఆసక్తికరంగా ఒకవేళ వైయస్ జగన్ ప్రభుత్వం రాజధానిని షిప్ట్ చేయదలిస్తే ఎక్కడికి మారుస్తుంది? అన్న చర్చ కూడా టీవీ చానెల్ వేదికలపై హీటెక్కించింది. కమ్మ సామ్రాజ్యం భూములు కొనుక్కున్న చోట రాజధాని పెట్టుకున్నారు. ఇప్పుడు రెడ్డి సామ్రాజ్యం ఎక్కడ విస్తరించి ఉందో అక్కడికి రాజధాని షిఫ్ట్ అయిపోవడం ఖాయం అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేసారు.
<
p style=”text-align: justify”>మొత్తానికి నిశ్చలంగా ఉన్న తటాకంలో బొత్స అణుబాంబునే విసిరారు. ఈ దెబ్బకు గుండెలు గుబగుబలాడిపోయాయ్. మాట రానంతగా ఊపిరిసలపనంత ప్రమాదకర బాంబ్ నే విసిరారు బొత్స. ఇది కేవలం ఏదో సరదాకి చేసిన వ్యాఖ్య కాదన్నదే ఇప్పటికీ అందరి నుంచి వినిపిస్తున్న మాట. కోట్ల కొద్దీ పెట్టుబడుల్ని వెదజల్లి రాజధానిని రియల్ వెంచర్ గా మార్చేసిన కమ్మ సామ్రాజ్యంలో ఇప్పుడు ప్రకంపనాలు చెలరేగుతున్నాయి. ఇక ఈ భయాన్ని చూస్తూ రెడ్డి సామ్రాజ్యం వినోదాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ మొత్తాన్ని చూస్తూ ఇతరత్రా జనం తమని తాము నమ్మలేక ఏదో అవుతోందిలే! అని స్థబ్ధుగా ఉన్నారు. ఇంతకీ రెడ్డి రాజ్యానికి సరిపడేలా భారీగా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి? అన్నది ఆరాతీసే పనిలో మీడియా కంపెనీలన్నీ బిజీబిజీగా ఉన్నాయి మరి!! అరకొరగా అంతంత మాత్రంగా ఉన్న కాపు మీడియా కూడా ఆ పనిలోనే ఉందన్నది మరో ఆసక్తిక టాపిక్.