సుడిగాడి ఫేమ్ మోనాల్ గజ్జర్ పేరు అందరికి కాకపోయినా కొందరికైనా తెలిసే ఉంటుంది. మరీ అంతగా గుర్తు పెట్టుకోవాల్సిన స్టార్ హీరోయిన్ కూడా కాదు. అంతటి బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఏమీ లేవు. కానీ నిన్న ప్రారంభమైన బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో మొదటి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. మోనాల్ గజ్జర్ తన జీవితంలో చూసిన, ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.
పదిహేళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడని, అప్పుడు అమ్మ చేతిలో రూ. 700 ఉన్నాయని తన జీవితంలో అతి దుర్భరమైన స్థితి గురించి తెలిపింది. కానీ నాన్న చనిపోయిన రోజు ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలలేదని, తన వెంటే ఉన్నాడన్న నమ్మకం తనకుందని తెలిపింది. ఆ రోజు నాన్నకు ప్రామీస్ చేశానని, కుటుంబాన్ని అమ్మని బాగా చూసుకుంటానని ఫిక్స్ అయ్యానని చెప్పుకొచ్చింది. మోడలింగ్ నుంచి సినీ రంగానికి వచ్చాక మొదటి సారిగా ఇంట్లోకి కొన్ని వస్తువులు కొన్నానని పేర్కొంది.
మొదటి స్కూటీ, మొదటి కలర్ టీవీ ఇలా చిన్న చిన్న సంతోషాలన్నీ నెరవేర్చుకున్నానని తెలిపింది. మన డబ్బుతో అలాంటి చిన్న సరదాలను తీర్చుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని, ప్రస్తుతం ఫ్యామిలీ హ్యాపీగా ఉందని మోనాల్ చెప్పుకొచ్చింది. మరి ఈ బిగ్‌బాస్ దయ వల్ల మంచి పేరు, క్రేజ్ సంపాదించుకుని ఇంకా పాపులర్ అవుతుందేమో చూడాలి. చివరి వరకు నిలబడి పోరాడుతుందా? లేదా? అన్నది చూడాలి.
Bigg Boss 4 Telugu, Monal Gajjar, Bigg Boss Telugu 4, Nagarjuna, మోనాల్ గజ్జర్ , బిగ్‌బాస్ తెలుగు 4, నాగార్జున