బిగ్ న్యూస్ : జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ పోస్ట్.!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఉన్నటువంటి బిగ్ స్టార్స్ అలాగే రాజకీయాల్లో కూడా భారీ ఇన్ఫ్లూయెన్స్ ఉన్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఎన్టీఆర్ సినిమాల పరంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కడికో వెళ్తున్నాడు.

మరి సరిగ్గా అయితే ఇదే సమయంలో ఎన్టీఆర్ నుంచి పొలిటికల్ మూవ్ లు కూడ అనెమ్మదిగా కనిపిస్తుండడం షాకింగ్ గా మారుతుంది. రీసెంట్ గా బీజేపీ నేత అమిత్ షా తో కలవడం ఏపీలో జనసేన నేతలు ఎన్టీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో కనిపిస్తారని చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

ఇక లేటెస్ట్ గా అయితే ఏపీలో ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం పట్ల చాలా కాంట్రవర్సీ నడుస్తుండగా దీనిపై ఎన్టీఆర్ కీలక కామెంట్స్ చేస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సెన్సేషన్ గా మారింది. “ఎన్టీఆర్, వై ఎస్సార్ లు ఇద్దరు కూడా ఎంతో విశేష ఆదరణ ఉన్న నాయకులు.

ఈ రకంగా ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం వల్ల ఎవరి గౌరవము తగ్గదు అలాగే మరొకరి గౌరవం తగ్గదు. ఎన్టీఆర్ విశ్వ విద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చినంత మాత్రాన తెలుగు ప్రజల్లో ఎన్టీఆర్ పేరు, కీర్తిని ఎవరూ తగ్గించలేరని” ఎన్టీఆర్ ఇపుడు తన స్పందన తెలియజేయడం సెన్సేషనల్ గా మారింది. దీనితో ఎన్టీఆర్ పోస్ట్ ఆసక్తిగా మారింది.