నిమ్మగడ్డ రమేష్ కుమార్ .. ఇప్పుడు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ లో ఓ సంచలనం. ఏపీలో ఎలాగైనా లోకల్ ఎన్నికలు జరపాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన ఎన్నికలు జరపాలి అని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో , అంతకుమించి ప్రభుత్వం ఎన్నికల పై అనాసక్తి చూపిస్తుంది. కరోనా , వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు అంత ముఖ్యంకాదు అంటూ చెప్తుంది. అయితే , ఈ మద్యే ప్రభుత్వం తో సంబంధం లేకుండా ఎన్నికల షెడ్డ్యూల్ కూడా ప్రకటించారు.
సాధరణంగా ఆయనది ఎంత రాజ్యాంగ బద్ధమైన పదవి అయినప్పటికీ ప్రభుత్వ సహకారం అవసరం. ఆయన నిర్ణయం ఫైనల్ అయినప్పటికీ ప్రభుత్వంతో కలసి కూర్చుని ఆలోచించిన తరువాత తాను ఫైనల్ డెసిషన్ ప్రకటించాలి. ఈ సన్నని గీతను ఆయన విస్మరించడం వల్లనే ఇపుడు ఇన్ని రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి. గత ఏడాది ఎన్నికలు నిర్వహించడానికి జగన్ సర్కార్ ఎంత ఉత్సాహం చూపించినా కూడా వాయిదాకే అంతా ఓటేశారు. ఇపుడు కరోనా వ్యాక్సినేషన్ రూపంలో జగన్ సర్కార్ కి అతి పెద్ద ఆయుధం ఉంది. దాన్ని కాదని నిమ్మగడ్డ ముందుకు పోలేరు.
ఇప్పటికిపుడు ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ ఎంతగా ఆరాటపడుతున్నా దానికి లాజిక్ కనిపించడంలేదు. కరోనా వ్యాక్సినేషన్ ఇపుడు ముఖ్యం. ఇది ఒక్క ఆంధ్రాలోనే కాదు, దేశమంతా సాగుతోంది. మరి ఆ విషయంలో అన్ని రాష్ట్రాలు అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని కూడా కేంద్రం ఒకటికి పదిసార్లు చెబుతోంది. ఇది కోట్లాది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. దీన్ని కాదని ఎన్నికలు పెడతామంటే ఎవరూ అంగీకరించరు. అందువల్ల నిమ్మగడ్డ కోర్టుల ద్వారా పోరాటం చేస్తే చేసుకోవచ్చు కానీ మరో వైపు చూస్తే ఆయన పదవీ కాలం తొందరలోనే ముగుస్తోంది మరి. మొత్తానికి నిమ్మగడ్డ రిటైర్ కావడమే మిగిలి ఉందని వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.