Bhuma Mounika: పిల్లల జోలికొస్తే ఊరుకోను… పోలీసులకు భూమా మౌనిక మాస్ వార్నింగ్!

Bhuma Mounika: మంచు కుటుంబంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో భూమా మౌనిక సైతం పోలీసులకు తనదైన శైలిలోనే మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఈ కుటుంబంలో మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు విష్ణు అనే విధంగా గొడవలు జరుగుతున్నాయి విష్ణు పూర్తిగా తన మద్దతు తన తండ్రికి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు మనోజ్ పై దాడి చేయించారని తెలుస్తోంది.

ఇక మోహన్ బాబు స్టాఫ్ పట్ల మనోజ్ కూడా చేయి చేసుకున్నారంటూ ఒకరిపై మరొకరి విమర్శలు చేసుకుంటూ పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా మంచు కుటుంబంలో గత మూడు రోజుల నుంచి గొడవలు ఏ మాత్రం సర్దుమనగడం లేదు. ఇలా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మంచు మనోజ్ భార్య భూమా మౌనిక పోలీసులకు వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ వీడియోలో భాగంగా భూమా మౌనిక మాట్లాడుతూ.. నా పిల్లల జోలికి వస్తే మాత్రం అసలు ఊరుకోనని ఈమె వార్నింగ్ ఇచ్చారు. మీరు కనుక న్యాయపరంగా చర్యలు తీసుకోకపోతే నేను ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తానంటూ ఈమె వార్నింగ్ ఇస్తూ మాట్లాడారు. నేను స్పీకర్ పెట్టే మాట్లాడుతున్నాను మనోజ్ కు పూర్తిగా గాయాలయ్యాయి అంటూ ఈమె మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతుంది.

ఇలా ఈ కుటుంబంలో గొడవలు జరుగుతున్నది ఏ విషయం గురించి అనేది స్పష్టత లేకపోయినా గత కొంతకాలంగా మంచు మోహన్ బాబు విష్ణు మనోజ్ ను దూరం పెడుతూ వస్తున్నారు. అదేవిధంగా యూనివర్సిటీ విషయంలో కూడా గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు విష్ణుకి ఇష్టం లేదని అది కూడా గొడవకు కారణం అనే వార్తలు బయటకు వస్తున్నాయి. మరి పూర్తి వివరాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.