Bheemla Nayak : తగ్గేదే లే.. అంటోంది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. సినిమాల విషయంలో. నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా విడుదల నేపథ్యంలో థియేటర్లపై ‘దాడులు’ నిర్వహించి, చాలా థియేటర్లను అధికారు
లు సీజ్ చేస్తున్న విషయం విదితమే. ఇంకోపక్క టిక్కెట్ ధరల్ని గణనీయంగా తగ్గించేశారు.
‘అఖండ’ సినిమా విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరించామని సాక్షాత్తూ వైసీపీ నేత మల్లాది విష్ణు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించుకోవాలి తప్పదు. అంటే, కొన్ని సినిమాలపై అధికార వైసీపీ ఖచ్చితమైన రాజకీయ వ్యూహంతో పనిచేస్తోందన్నమాట.
పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ తరఫున మాట్లాడినప్పుడు ఆయనకు మద్దతుగా మాట్లాడిన ఒకే ఒక్క హీరో నాని మాత్రమే. అందుకే, నాని సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ టార్గెట్ అయ్యింది. మరి, పవన్ కళ్యాణ్ సినిమానే విడుదలైతే, వైసీపీ ఎటాక్ మరో స్థాయిలో వుంటుంది.
సో, ‘భీమ్లానాయక్’ ముందు ఒకే ఒక్క ఆప్షన్ వుంది.. అదే ఓటీటీ.. అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించకుండా తెలంగాణ, ఓవర్సీస్, కర్నాటక తదితర రాష్ట్రాల్లో తెలుగు ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం, ‘భీమ్లానాయక్’ థియేటర్లలో విడుదలవడమే సబబు.
సంక్రాంతికి విడుదల కావాల్సిన (జనవరి 12) ‘భీమ్లానాయక్’, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఫిబ్రవరి 25కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో టిక్కెట్ల గోల కారణంగా, ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ కూడా టెన్షన్ పడాల్సి వస్తోంది.