బికాం ఫిజిక్స్ జలీల్ ఖాన్ జగన్ పై సెన్సేషనల్ కామెంట్స్

వక్ఫ్ బోర్డు చైర్మన్, టిడిపి  ఫిరాయింపు  ఎమ్మెల్యే జలీల్ ఖాన్   ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరకరమయిన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన తన హోదా మర్చిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు.  

2014 ఎన్నికల్లో వైసిపి తరఫున జలీల్ ఖాన్ ఎమ్మెల్యే అయ్యారు. అయినా ఆయన టిడిపిలో చేరారు. ఫిరాయించిన ఎమ్మెల్యే నన్న విషయం మర్చి పోయి  ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు…

 

జగన్, ఆయన శాసనసభ్యులు అసెంబ్లీకి రాకుండా గొర్రెల్లాగా రోడ్లపై తిరుగుతున్నారు

అవినీతి జరిగిందని చెప్పే జగన్ అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడం కరెక్టేనా?

సరుకు, సబ్జెక్ట్ లేక వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ కి రావడం లేదు?

సిగ్గూ, లజ్జా ఉంటే ప్రతిపక్ష నాయకుడు, వైసిపి ఎమ్మెల్యేలు జీతాలు వెనక్కి ఇవ్వండి?

కన్నా (బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ) పేరు లోనే కన్నం ఉంది..గుంటూరులో నేను పోటీ చేస్తే కన్నాకు డిపాజిట్ కూడా రాదు?

మంత్రిగా ఉన్నప్పుడు కన్నా అనేక అవినీతి ఆరోపణలకు పాల్పడ్డారు.

చంద్రబాబే హీరో . జగన్, పవన్, కన్నా ముగ్గురు విలన్లు

పుట్టిన ఊరులో అన్న ను గెలిపించలేకపొయిన పవన్ కు సిగ్గుందా?

రాబోయే ఎన్నికల్లో పవన్‌ పార్టీ కి ఒక్క సీటు కూడా రాదు.

జైలులో ఉండివచ్చిన జగన్ చంద్రబాబు అవినీతిపరుడని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

వచ్చే ఎన్నికల్లో జగన్ కు 27 సిట్లు కూడా రావడం కష్టమే.

జివిఎల్ (జివిఎల్ నరసింహారావు) కార్పొరేటర్ గా గెలవలేని వ్యక్తి , టిడిపి పై విమర్శలా

రోజురోజుకూ జగన్ గ్రాఫ్ తగ్గిపోయింది..జగన్ డబ్బులిచ్చి పాదయాత్రకు జనాలను తరలిస్తున్నారు.

జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అల్లకల్లోలం కావడం ఖాయం.