తెలంగాణ సీఎల్పీ నేతగా మల్లు బట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎల్పీ నేత ఎన్నిక బాధ్యతను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత రాహుల్ గాంధీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు రాహుల్ బట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా ఎంపిక చేశారు. సీఎల్పీ నేత పదవి కోసం సీనియర్ ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డి శ్రీధర్ బాబు లాంటి నేతలు ప్రయత్నాలు చేసారు. కానీ రాహుల్ మాత్రం బట్టి వైపే మొగ్గు చూపారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బట్టికి గట్టి పోటీ ఇచ్చారు. ఒకదశలో ఆమె అభ్యర్థిత్వాన్ని సీరియస్ గా పరిశీలించినట్లు తెలుస్తోంది.