తొక్కినేని వివాదాన్ని ఇంకా గట్టిగా కెలికిన నందమూరి బాలకృష్ణ

సోషల్ మీడియా వేదికగా తొక్కినేని వర్సెస్ ముండమూరి.. వివాదం కొనసాగుతోంది. అత్యంత దారుణమై ట్రోలింగ్ ఇది. నిజానికి, ఆ మహానుభావులిద్దరూ పైనుంచి చూస్తూ సిగ్గుపడుతుంటారు ఈ గొడవని చూసి. ఈ వివాదానికి ఆద్యుడు సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

‘తొక్కినేని’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు అక్కినేని కుటుంబ సభ్యుల్ని, అక్కినేని అభిమానుల్నీ తీవ్రంగా బాధించాయి. ‘మన పరువు మనమే తీసుకోకూడదు’ అని నాగచైతన్య, అఖిల్ సోషల్ మీడియా వేదికగా ‘సూచించినా’ బాలయ్య మారలేదు. మారితే, ఆయన బాలయ్య ఎందుకవుతాడు.?

‘మీ కంటే నా దగ్గరే అక్కినేనికి ప్రేమ దక్కింది’ అంటూ అక్కినేని వారసులపై నందమూరి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పరోక్షంగా. ‘ప్రేమ అక్కడ లేదు.. నా దగ్గర వుంది’ అంటూ అక్కినేని గురించి బాలయ్య చెప్పడం పెను దుమారం రేపుతోంది. ‘మెంటల్ బాలకృష్ణ’ హ్యాష్ ట్యాగ్ ఇంకోసారి వైరల్ అవుతోన్నది ఇందుకే. టీడీపీ ఎమ్మెల్యేగా, సీనియర్ నటుడిగా నందమూరి బాలకృష్ణ ఏమాత్రం సంయమనం పాటించడంలేదు, సంస్కారవంతంగా మాట్లాడటంలేదు.

‘ఏదో పొరపాటున మాట దొర్లింది..’ అనేస్తే సరిపోయేదానికి, ఇలా ఎందుకు బాలయ్య కెలికి కంపు చేస్తున్నారన్నదే ఎవరికీ అర్థం కావడంలేదు. ‘అర్జంటుగా బాలకృష్ణని మెంటల్ ఆసుపత్రికి తరలించాలి’ అని డిమాండ్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ఇదా పద్ధతి.? అసలు నందమూరి బాలకృష్ణకి ఏమయ్యింది.?

కాగా, స్వర్గీయ ఎన్టీయార్ చివరి రోజులను గుర్తు చేస్తున్న అక్కినేని అభిమానులు, ‘మీ నాన్నకి చివరి రోజుల్లో తిండి కూడా పెట్టలేదు మీరు’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.