మీడియాకు క్షమాపణలు చెప్పిన హీరో బాలకృష్ణ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మీడియా ప్రతినిధిపై హిందూపురం టీడీపీ అభ్యర్థి, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కొట్టాడని, తిట్టాడని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుండటంతో బాలకృష్ణ స్పందించారు. వారు మీడియా వారని తనకు తెలియదని, అల్లరి మూకలని అనుకుని వారిని వారించానని అన్నారు. క్షమాపణలు కోరారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.