AP: పవన్ కళ్యాణ్ ను తిట్టొద్దని మా అమ్మకు చెప్పారు… వైకాపా మాజీ మంత్రి కామెంట్స్?

AP: గత ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైకాపా నాయకులు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ లపై తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి ఇష్టానుసారంగా దుర్భాషలాడారు. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి తన పెళ్లిళ్ల గురించి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభలకు వెళ్లిన అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలుకొని మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ హేళన చేశారు.

ఇలా పవన్ కళ్యాణ్ గురించి వారు మాట్లాడిన తీరే 2024 ఎన్నికల ఫలితాలలో వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పిందని చెప్పాలి. ఇలా పవన్ కళ్యాణ్ ను ఇష్టాను సారంగా తిట్టడం వల్ల తమ పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిందని స్వయంగా వైకాపా నేతలే ఒప్పుకున్నారు. ఈ విధంగా పవన్ ను టార్గెట్ చేయడంతోనే చంద్రబాబు నాయుడు పవన్ చేతులు కలిపారు. తద్వారా తమ పార్టీని ఘోరంగా ఓడించారని తెలిపారు.

అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వైకాపా మాజీ మంత్రి అమర్నాథ్ ఇదే విషయం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రజలలో విభేదాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్‌పై మేము చెప్పిన మాటలు, కొన్నిసార్లు మేము అతనిని రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన విధానం ఈ ఓటమికి ప్రధాన కారణం.

పవన్ కళ్యాణ్ గురించి అలా మాట్లాడొద్దు అంటూ నా శ్రేయోభిలాషులు నాకు ఎన్నో సందర్భాలలో తెలిపారు అయినప్పటికీ నేను వినలేదు ఇక చివరికి మా అమ్మకు ఫోన్ చేసి కూడా పవన్ కళ్యాణ్ అలా తిట్టొద్దని చెప్పండి అంటూ చెప్పారని తెలిపారు. ఇక ప్రజల నుంచి కూడా ఈ విధమైనటువంటి అభ్యంతరాలు వచ్చినట్టు అమర్నాథ్ ఈ సందర్భంగా వెల్లడించారు.