AP: గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ రోజు కూడా ఒకటో తేదీ జీతం అందుకున్న పాపాన పోలేదు అంటూ ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డబ్బులను మొత్తం సంక్షేమ పథకాలకు మళ్ళించి ఈయన ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చాలా దారుణంగా వ్యవహరించారని ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. ఒక రకంగా చెప్పాలి అంటే జగన్ ఓటమిపాలు కావడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా కారణమని చెప్పాలి.
ఇక కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి.. కూటమి ప్రభుత్వంలో టీచర్లతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఒకటో తారీకునే పూర్తిస్థాయిలో జీతం అందుకున్నారు. ఇలా మొదటి కొన్ని నెలల పాటు ఒకటో తారీకునే జీతం అందజేసిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు జీతం విషయంలో మాట తప్పారని తెలుస్తోంది.
ఒకటో తేదీ కాదు ఆరో తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ ఇంకా ప్రభుత్వ టీచర్లకు జీతాలు పడకపోవడంతో కూటమి ప్రభుత్వంలో కూడా జీతం కోసం ఎదురుచూపులు తప్పలేదని తెలుస్తుంది. మరొక వారం రోజులలో తెలుగువారికి అతిపెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగ కూడా రాబోతోంది. ఇంకా టీచర్లకు జీతాలు పడకపోవడంతో టీచర్లు లబోదిబోమంటున్నారు.గత ఏడాది డిసెంబరు 31నే బిల్లులు రెఢీ అయ్యాయని.. జనవరి 1న వేతనాలు పడిపోతాయన్న ప్రచారం జోరుగా సాగింది.
ఈ విషయంపై ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా జీతాల కోసం ఇలాగే ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా మా పరిస్థితి అదేనంటూ మండిపడుతున్నారు. నెల మొత్తం గడిచిపోయిన మరో నెలలో సగం రోజులు పూర్తి అవుతున్న జీతాలు అందడం లేదంటూ వాపోయారు. మరి ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు కూటమి నేతలకు కనిపించడం లేదా రాజకీయాలలో ఎన్నో సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకొని చంద్రబాబు నాయుడు టీచర్ల జీతాలు టైంకు వేసే విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నట్లు అంటూ పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.