AP Politics: ఢిల్లీలో చక్రం తిప్పిన బాబు.. ఏపీలో జగన్ మెడకు బిగుస్తున్న ఉచ్చు?

AP Politics: ఏపీ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక కేసులో ఇరికించాలని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అదానీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఇప్పటికే అమెరికా కోర్టులో ఆదానీ ఏపీలో విద్యుత్ ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చారని అభియోగాలు నమోదయ్యాయి. ఈ తరుణంలోనే ఏపీ కూటమి ప్రభుత్వం జగన్ పేరును ప్రస్తావించే విషయంలో కాస్త ఆచి చూచి అడుగులు వేస్తోంది.

కేంద్రంతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఆదానీ వివాదం పైన స్పందించటం లేదు. కానీ, ఈ కేసులో జగన్ ను మాత్రం ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. ఈ విషయంపై ఇటు రాజకీయాల పరంగా, న్యాయపరంగా ఎన్నో మంతనాలు చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ఈ వ్యవహారంలో ఇరికించాలి అంటే కూడా కేంద్రం నేతల నిర్ణయం కూడా కీలకంగా మారింది.

అదానీ గ్రూప్స్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విద్యుత్ ప్రాజెక్టు విషయంలో ముడుపుల ఇచ్చారని, ఈ విషయంలో మాజీ సీఎం జగన్ ను వదల కూడదని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేసు పైన కూటమిలోని ముఖ్య నేతలు మాత్రం ఇప్పటి వరకు అధికారకంగా స్పందించ లేదు.కేంద్ర ప్రాజెక్టు సెకీతో నాడు జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ఆదానీ కేసు విషయంలో ఇదే కీలకంగా మారినప్పటికీ ఆదానీ వ్యవహారంలో కేంద్రం మాత్రం స్పందించటం లేదు.

ఇలా ఢిల్లీలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఇరికించడం కోసం ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ కొంత మంది కేంద్ర మాజీ మంత్రులను కూడా కలుస్తూ చర్చలు జరుపుతున్నారు.తాజాగా అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ఇదే అంశం పైన పలువురు సభ్యులు సభలో ప్రస్తావన చేసారు. జగన్ పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసారు. కానీ, ముఖ్యమంత్రి స్పందిస్తూ అవినీతి చేసిన వారిని ఎట్టి పరిస్థితులలో వదలబోమని చెప్పారు. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డిని ఈ విషయం గురించి ఇబ్బందులకు గురి చేస్తే కేంద్రం ఎలా స్పందిస్తుందనే విషయంపైనే బాబు ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో ఢిల్లీ పెద్దలతో చర్చించిన తరువాతనే సరైన నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో సీఎం ఉన్నారు.