ఏపీ సీఎస్ గా భాద్యతలు తీసుకున్న ఆదిత్యనాథ్ దాస్

ఏపీ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరించారు. చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని పదవీకాలం నేటితో ముగియబోతుంది. దీనితో ఆమె స్థానంలో ఆదిత్యనాథ్ దాస్ కొత్త సీఎస్‌ గా నియమిస్తూ ప్రభుత్వం వారం క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ఈ రోజు ఆదిత్యనాథ్ దాస్ కొత్త చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు.

AP New CS: ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్.. నక్సల్స్ తూటాల నుంచి బయటపడిన సందర్భం

ఆదిత్యనాథ్‌ దాస్‌ సొంత రాష్ట్రం బీహార్‌. తల్లిదండ్రులు డాక్టర్‌ గౌరీ కాంత్‌ దాస్‌, కుసుం కుమారి. 1987వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్‌ , ఢిల్లీలోని జేఎన్‌యూలో ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ చేశారు. విజయనగరం, విజయవాడ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, కృష్ణా జిల్లా జేసీగా, వరంగల్‌ కలెక్టర్‌గా, మురికివాడల అభివృద్ధి పథకం పీడీ, అదనపు కమిషనర్‌, మునిసిపల్‌ పరిపాలన కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌, నీటి పారుదల శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కూడా ఆయన సేవలందించారు. 2007 నుంచి ఆయన ఇరిగేషన్ శాఖలో కీలక బాధ్యతల్లో ఉన్నారు.

ఆదిత్యనాథ్ దాస్ మీద సుమారు 20 ఏళ్ల క్రితం హత్యాయత్నం జరిగింది. ఆయన మీద నక్సల్స్ కాల్పులు జరిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఆయన ఏటూరునాగారంలో ఐటీడీఏ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే, ఆ సమయంలోనే ఆయన మీద ఎటాక్ జరిగింది. నక్సల్స్ ఎటాక్ చేశారు. ఆ కాల్పుల్లో ఆదిత్యనాథ్ దాస్‌ భుజానికి బుల్లెట్ తగిలింది. అదే సమయంలో ఆయన కారు డ్రైవర్‌కు కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి.