AP: ఏపీలో గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయింది. ప్రతి గ్రామంలోనూ సుమారు 8 నుంచి పదిమంది వరకు ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. ఆ గ్రామ పరిధిలో ప్రజలకు ఏ అవసరం వచ్చిన సచివాలయం వద్దకు వెళ్తే వెంటనే పని జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇకపోతే వాలంటీర్ వ్యవస్థను కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారు.
ఇలా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతో మంది ఎన్నో విధాలుగా లబ్ధి పొందారు. ప్రభుత్వం నుంచి అందే ప్రతి ఒక్క పథకం కూడా వాలంటీర్ ద్వారా ప్రజల ముంగిటకు వెళ్ళేది. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను కూటమి నేతలు కూడా అభినందించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదివేల రూపాయల జీతంతో వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అయితే వాలంటీర్లను తీసుకునే ఉద్దేశమే లేదని తెలుస్తోంది.
ఇకపోతే తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తొలగించడమే కాకుండా గతంలో ప్రతి ఒక్క పథకం ఇంటి ముంగిటకు వెళ్లేది కానీ ఇప్పుడు ప్రజలే అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిపై ప్రజలలో ఏ విధమైనటువంటి స్పందన ఉంది ఈ ప్రభావం కూటమి పార్టీపై చూపే అవకాశాలు ఉన్నాయా అనే విషయానికి వస్తే ఏమాత్రం లేవనే చెప్పాలి.
ప్రజలు ప్రతి ఒక్క పథకం మా ఇంటి ముంగిటకు తెచ్చి ఇవ్వాల్సిన పనిలేదు మాకు పథకం అందితే చాలు మేమే వెళ్లి తెచ్చుకుంటాం అనే దూరంలో ఉన్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటింటికి డాక్టర్ పథకం అలాగే ఇంటింటికి రేషన్ బియ్యం పథకాన్ని కూడా నిలిపివేశారు. ఒకప్పుడు రేషన్ బియ్యం ఇవ్వటానికి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేస్తూ ఇంటి వద్దకే రేషన్ సరుకులను పంపిణీ చేసేవారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ దుకాణాల వద్ద రేషన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది వారి పనులను వదులుకొని మరి రేషన్ దుకాణాల దగ్గరకు వెళ్లడం మనం చూస్తున్నాము. అయితే ఇలా డోర్ డెలివరీ లేకపోయినా తమకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని ప్రజలు చెప్పకనే చెబుతున్నారు. తద్వారా కూటమి పార్టీపై ఈ ప్రభావం ఏ మాత్రం చూపే అవకాశాలు లేవని పలువురు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.