ఏపీ ప్రభుత్వానికి న్యాయవ్యవస్థకు కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది న్యాయమూర్తులు కావాలనే ప్రభుత్వాన్ని ఆస్తిరపరచే కుట్ర చేస్తున్నారని వైఎస్ జగన్ సుప్రీం చీఫ్ జస్టిస్ కు లేఖను రాశారు. ప్రస్తుతం ఈ అంశం పరిశీలనలో ఉంది. ఇటీవలే తెలుగు రాష్ట్రాల న్యాయమూర్తుల బదిలీకి ఆదేశాలు కూడ వచ్చాయి. ఇదిలా ఉండగా జస్టిస్ రాకేష్ కుమార్ మీద ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని తెలుపుతూ కోర్టులో వేసిన పిటిషన్ మీద వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. ఈ ప్రస్తావన తెస్తున్నది మరెవరో కాదు ప్రభుత్వం తరపున న్యాయవాది కావడం విశేషం.
మిషన్ బిల్డ్ ఏపీ పథకంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థలాలను వేలం వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇవి ఈ నెల 11న విచారణకు రావడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం వేలం ఎలా వేస్తుంది. ఆస్తుల వేలం వేయడాని ప్రభుత్వం ఏమైనా దివాలా తీసిందా ? అంటూ ప్రశ్నించారు జస్టిస్ రాకేష్ కుమార్. ఆ సమయంలోనే విచారణకు వచ్చిన హెబియస్ కార్పస్ పిటిషన్ల మీద కూడ విచారణ చేసిన రాకేష్ కుమార్ అక్రమ నిర్బంధనలు తగవని డీజీపీకి చెప్పినా ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని వ్యాఖ్యానిస్తూ రాజ్యాగా వ్యవస్థల విచ్ఛిన్నం జరుగుతున్నదా అనేది అంశమై పరిశీలన చేస్తామని అన్నారు.
దీంతో ప్రభుత్వం రాకేష్ కుమార్ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయని ప్రకటిస్తాం. పరిపాలనను కేంద్రానికి అప్పగిస్తామని అన్నారని, న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు లేదని ఆయన విచారణ నుండి తప్పుకోవాలని పిటిషన్ వేశారు. దీనిపై నిన్న ధర్మాసనం విచారణ చేయగా రాకేష్ కుమార్ తాను ఆలా అనలేదని, రికార్డుల్లో ఉంటే చూపించాలని అన్నారు. దానికి ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టు చేసిన వ్యాఖ్యలు మరుక్షణమే ఏబీఎన్ టెలివిజన్‌లో వచ్చాయని, తర్వాతి రోజున పత్రికలో కూడా వచ్చాయని అన్నారు. అలా వస్తే సాక్ష్యాలు చూపాలని అన్నారు. దీనికి ప్రభుత్వం తరపున న్యాయవాది వద్ద సంధానం లేదు. నేను ఆ వ్యాఖ్యలు చేసినట్లు కేవలం మీరు, పిటిషనర్ మాత్రమే చెబుతున్నారు. రికార్డుల్లో కూడా ఆ వ్యాఖ్యలు కనిపించడం లేదు అని రాకేష్ కుమార్ అన్నారు.
రాకేష్ కుమార్ ను విచారణ నుండి తప్పించడానికి ప్రభుత్వం ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలను సాక్ష్యాలుగా వాడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు ఆంధ్రజ్యోతి సైతం ఈ విషయంపై ప్రచురించిన వార్తల్లో రాకేష్ కుమార్ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయని ప్రకటిస్తాం. పరిపాలనను కేంద్రానికి అప్పగిస్తామని అన్నట్టు తాము ప్రచురించిందీ లేనిది క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తోంది.