AP: బియ్యం అక్రమ రవాణాలో నిజానిజాలు బయటపెట్టాలి: ద్వారంపూడి

AP: ఇటీవల కాకినాడ పోర్టులో భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన కాకినాడ పోటును తనిఖీ చేసిన సంగతి తెలిసిందే ఇలా అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్న షిప్పును సీజ్ చేయించారు. అయితే ఈ అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యం మాజీ వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతుంది అంటూ నాదెండ్ల మనోహర్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ సందేహాలను వ్యక్తపరిచారు.

వైకాపా హయామంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్ట్ ద్వారా ఎన్నో అక్రమ రవాణాలను చేపట్టారని గత ప్రభుత్వ హయామంలో ఈయన భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ కొన్ని కోట్ల రూపాయలను సొమ్ము చేసుకున్నారు అంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి మాట్లాడారు. ఇలా పవన్ కళ్యాణ్ అలాగే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన పేరును ఉచ్చరించడంతో ద్వారంపూడి స్పందించారు.

తన పై నిరాధార ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకుంటే కొండబాబు చరిత్ర తెలుస్తుందని ఆయన చెప్పారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, అధికారంలో ఉన్నది మీరే కనుక విచారణ జరిపించి నిజా నిజాలను బయటపెట్టాలని ఈయన సవాల్ విసిరారు.

ఇలా భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుపుతున్నది ఎవరు ఇందులో ఎవరి ప్రేమే ఉంది అనే విషయాలన్నింటిని బయట పెట్టాలని ఈయన వెల్లడించారు. ఇక కాకినాడ పోర్ట్ లో ఈ విధమైనటువంటి అక్రమ రవాణా విషయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా రేషన్ బియ్యం మాఫియా పై కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.