సాఫ్ట్ వేర్ భార్య ఎఫైర్, సాఫ్ట్ వేర్ భర్త సూసైడ్ కేసులో బయటపడ్డ మరో సంచలన నిజం

ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. రోజుకో తీరుగా కేసు పలు మలుపులు తిరుగుతోంది. భార్య ప్రవర్తన వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ప్రశాంత్ రాసిన లేఖ ద్వారా జరుపుతున్న పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అక్టోబర్ 29 వ తేదిన ప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన తిరునగరి ప్రశాంత్ సిలికాన్ ఇమేజ్ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను ఐఐటి ఖరగ్ పూర్ లో టాప్ స్టూడెంట్. ఇతనికి 2014 లో వరంగల్ జిల్లాకు చెందిన పావనితో వివాహం జరిగింది. వీరు పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలో పద్మజ మెన్షన్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు.

2014 లో వివాహం అయిన తర్వాత పావని కూడా సాప్ట్ వేర్ జాబ్ లో చేరింది. టాప్ స్టూడెంట్ కావడంతో పెద్దలు కుదిర్చిన వివాహమే అయినప్పటికి పావని ప్రశాంత్ ను ఎంతో ఇష్ట పడి పెళ్ళి చేసుకుంది. పెళ్లయ్యాక వీరి కాపురం ఆనందంగానే సాగింది. ప్రశాంత్ స్నేహితుడే ప్రణయ్. వీరిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండేవారు. ప్రశాంత్ ఇంటికి ప్రణయ్ అప్పుడప్పుడు వచ్చి వెళుతుండేవాడు. ప్రణయ్ కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావడం, టెక్నికల్ పరంగా ప్రణయ్ కాస్త తెలివైన వాడు. పావనికి ఉద్యోగానికి సంబంధించిన విషయాలలో ప్రణయ్ సహాయం చేసేవాడు. అలా పావని, ప్రణయ్ ల మధ్య పరిచయం పెరిగింది.

 

పావని, ప్రణయ్ ల మధ్య ఏర్పడిన పరిచయం చాటింగ్ లు, ఫోన్ కాల్స్ వరకు వెళ్లింది. ఇద్దరూ బయట కూడా కలుసుకునేవారు. అలా పావని ప్రవర్తనలో కొద్ది కొద్దిగా మార్పు రావడంతో ప్రశాంత్ కు అనుమానం పెరిగింది. ప్రణయ్ తో పావని చేస్తున్న స్నేహ విషయం ప్రశాంత్ కు తెలిసింది. భార్యను ఏమి అనకుండా మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. అయినా కూడా ఆమెలో మార్పు రాకపోవడంతో చేసేదేం లేక పావనిని నిలదీశాడు. అవును ఆయనకు నాకు మధ్య సంబంధం ఉంది నేను అలానే ఉంటా ఏం చేస్తావో చేస్కో అంటూ ప్రశాంత్ ను పావని హెచ్చరించింది. దీంతో ప్రశాంత్ మానసిక వేదనకు గురయ్యాడు.

ప్రశాంత్ కు విషయం తెలిసిందని పావని ప్రణయ్ కి తెలిపింది. అప్పటి వరకు వారి సాన్నిహిత్యం బయటికి పరిమితమైనది కాస్తా ఇంట్లోకి చేరింది. పావని ప్రశాంత్ కు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ప్రశాంత్ మనసు తెలిసిన పావని ప్రశాంతే తనంతట తనకు విడాకులు ఇచ్చేలా ప్లాన్ చేసింది. అయితే దీనికి ప్రణయ్ ఓ కొత్త ప్లాన్ వేశాడు. మనం ఇక నుంచి ఇంట్లోనే గడుపుదామని ఏదో ఓ రోజు ప్రశాంత్ చూస్తే వాడే ఇక నువ్వు వద్దంటూ చెప్తాడని అప్పుడు తనకు లైన్ క్లియర్ అవుతుందని పావనికి చెప్పాడు. దీంతో అప్పటి నుంచి వారు ఇంట్లోనే సన్నిహితంగా ఉండటం మొదలు పెట్టారు. కానీ ప్రణయ్ మాత్రం తెలివిగా ప్రశాంత్ డ్యూటిలో లేని సమయంలోనే ఇంటికి వచ్చాడు. ప్రశాంత్ వచ్చే సమయంలో ఇంట్లో ఉంటానని చెప్పి ప్రశాంత్ డ్యూటి వెళ్లిన సమయంలో ఎందుకు వస్తున్నావంటూ పావని ప్రణయ్ ని పలు మార్లు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.  కొంచెం ఓపిక పట్టాలంటూ ప్రణయ్ పావనికి చెప్తూ వచ్చాడు.

అప్పటికే వీరి గురించి తెలుసుకున్న ప్రశాంత్ ఆధారాలు ఉండాలని సిసి కెమెరాలు, పెన్ను కెమెరాలతో వీరి బాగోతాన్ని అంతా గమనించేవాడు. పావనిని వదులుకోవడం ఇష్టం లేని ప్రశాంత్ తన కాపురాన్ని చక్కదిద్దుకోవాలనుకొని పావనిని జాబ్ మానించేశాడు. అప్పుడు ఖాళీగా ఉన్న పావని ఎక్కువ కాలం ప్రణయ్ తో గడిపేది. ఇక చేసేదేం లేక ప్రశాంత్ పావనికి బెంగూళూరులో జాబ్ చూయించి పంపించాడు. తాను కూడా మరో నెల రోజుల్లో జాబులో జాయిన్ అవుదామనుకున్నాడు. బెంగుళూరులో కూడా పావని ప్రణయ్ తో కలిసి ఉంటుందని ప్రణయ్ కూడా మరికొన్ని రోజుల్లో బెంగుళూరు కు ట్రాన్స్ ఫర్ అయి వస్తాడని తెలుసుకొని ప్రశాంత్ ఖంగుతిన్నాడు.

ఇక ఏం చేసినా తన భార్యలో మార్పు రాకపోవడంతో తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. తాను చనిపోయే వారం ముందు తన బావకు ఫోన్ చేసి తనకు బతకాలని లేదని తాను చనిపోతానని చెప్పాడు. పావని తల్లిదండ్రులకు ప్రశాంత్ విషయం చెప్పలేదు. ఎక్కడ పరువు పోతుందో అని భయపడ్డాడు. కావాలనే ఇంట్లోనే పావని ప్రణయ్ తో గడపడంతో ప్రశాంత్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ వివాహేతర సంబంధం గురించి తెలిసి ప్రశాంత్ విడాకులిస్తే ప్రణయ్, పావని పెళ్లి చేసుకుందామని ప్లాన్ వేసినట్టు విచారణలో తేలింది. భర్త చూడాలని ఇంట్లోనే ప్రియునితో గడపడానికి ఒప్పుకున్నానని పావని చెప్పడంతో పోలీసులు కూడా ఆశ్చర్య పోయారు. పావని ఏ మాత్రం భయం లేకుండా వ్యవహరించిన తీరును చూసి విచారణాధికారులు సైతం ఖంగు తిన్నట్టు తెలుస్తోంది.  ప్రశాంత్ పావనిల మధ్య జరిగిన సంభాషణ ఆడియో కింద ఉంది వినండి. 30 నిమిషాలు ఉన్న ఆడియో టేపులో పావని  చాలా ఘోరంగా మాట్లాడినట్టు తేలింది.  

https://www.youtube.com/watch?v=b2AtIGURxbc&t=78s