బాబుకి ఊహించని షాక్ ఇచ్చిన ఆంధ్రా యువత

బాబు వస్తే జాబు వస్తది అనే నినాదంతో 2014 ఎన్నికల సమయంలో యువతను ఆకట్టుకున్నారు టిడిపి అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు 2000 రూపాయలు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రతిపాదించారు. అయితే నాలుగేళ్లు గడిచినా ఉద్యోగాలు కల్పించడంలో బాబు విఫలమయ్యారు అనేది అంతటా వినిపిస్తున్న మాట.

నిరుద్యోగ భృతి విషయానికి వస్తే 2000 ఇస్తామని చెప్పి ఇటీవలే 1000 రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు లోకేష్. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు నిరుద్యోగులు. ప్రతిపక్షాలు విమర్శల దాడి కూడా చేశాయి. బాబు వస్తే జాబు వస్తది అని అన్నారు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదు అంటూ టిడిపిని దుయ్యబట్టాయి.

ప్రత్యేక హోదా విషయంలో బిజెపి రాష్ట్రానికి హ్యాండ్ ఇవ్వడంతో టిడిపిపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో మైత్రి కట్ చేసుకుంది తెలుగు దేశం పార్టీ. ఇక అప్పటి నుండి ఏ ఛాన్స్ వచ్చినా రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శల యుద్ధం ప్రకటిస్తున్నారు. వ్యతిరేకంగా మాటల దాడి చేసుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఒకరి లోపాలను మరొకరు ఎంచుకుంటూ, అవకాశాలను తమవైపు మలచుకుంటూ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.

బాబ్లీ కేసు విషయాన్నీ టిడిపి అండ్ కో చాల తెలివిగా ఇది బిజెపి పన్నిన కుట్ర అంటూ సింపతీ మార్క్స్ కొట్ట్టేసారు. దీనిపై విస్తృతంగా ప్రచారం కూడా చేసారు. అందులో విజయం కూడా సాధించినట్టే కనిపించాయి పరిస్థితులు. అయితే బిజెపి కూడా ఎదురు దాడికి దిగింది. కానీ ఎల్లో టీం ప్రచారం ముందు బిజెపి ప్రచారం డామినేట్ అయిపోయింది. అసలే ప్రత్యేక హోదా విషయంలో బిజెపి పై ఆగ్రహంతో ఉన్న జనం వీరి వాదనను పట్టించుకోలేదు కూడా. ప్రత్యేకహోదా విషయంలో ప్లాప్ అయిన బిజెపి టిడిపి ని ప్రజల్లో బ్యాడ్ చేసేందుకు పధకాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. హామీ ఇచ్చి బాబు సంపూర్తి చేయలేని పథకాలను అస్త్రాలుగా చేసి వాడుకుంటున్నటు స్పష్టం అవుతోంది.

ఈ నేపథ్యంలో బిజెపి బాబుపై వినూత్న నిరసన మొదలెట్టింది. “బాబు ఏది మా జాబు అంటూ” మట్టి పాత్రలతో బిజెపి యువత నిరసనకు దిగింది. దీనిపై బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ మీడియాతో మాట్లాడారు. బాబు తప్పుడు హామీలు ఇచ్చి యువతను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు అన్నారు. సీఎం పై ధర్మ పోరాటం చేయాలంటూ యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఒక్కరికి కూడా పెర్మినెంట్ జాబ్ ఇచ్చిన దాఖలాలు లేవని ఆయన పేర్కొన్నారు. యువనేస్తం పథకంలో 5 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ కేవలం లక్షా అరవై తొమ్మిది మందిని ఎంపిక చేశారని విమర్శలు చేసారు.